కృష్ణ

భద్రిరాజుపాలెం పిఎసిఎస్‌లో అవినీతిపై విచారణ జరపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, డిసెంబర్ 2: భద్రిరాజుపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం(పీఎసిఎస్)లో వేలాది రూపాయల అక్రమాలు జరిగాయని, వీటిపై సమగ్ర విచారణ జరపాలని ముగ్గురు డైరెక్టర్లు, రైతుమిత్ర గ్రూపు సభ్యులు డిమాండ్ చేశారు. ఇటీవల సహకార అధికారి వచ్చినా సరైన విచారణ జరగలేదన్నారు. భద్రిరాజుపాలెం కమ్యూనిటీహాలు వద్ద శుక్రవారం రాత్రి పిఎసిఎస్ డైరెక్టర్లు పుచ్చకాయల సీతారావమ్మ, జొన్నల సుబ్బారెడ్డి, వల్లూరు పోతురాజు, రైతుమిత్ర గ్రూపు సభ్యులు పుచ్చకాయల శ్రీలక్ష్మీ, తియ్యగూర శివపార్వతి, ఆళ్ళ మల్లీశ్వరి, ఆళ్ళపార్వతి, మండేపూడి ప్రసాదరెడ్డి, మండేపూడి శ్రీనివాసరెడ్డి పలువురు రైతులు విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. పీఎసిఎస్ ముఖ్య కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి, సిబ్బంది కలిసి రైతుమిత్ర గ్రూపుల నుంచి అక్రమంగా ఎక్కువ సొమ్ములు వసూలు చేశారని, విషయం వెల్లడి కావటంతో నలుగురికి డబ్బు చెల్లించి విషయం బయటకు రాకుండా చేశారని ఆరోపించారు. ఈ సమావేశంలో పాల్గొన్న రైతుమిత్ర గ్రూపు అధ్యక్షురాలు పుచ్చకాయల శ్రీలక్ష్మీ మాట్లాడుతూ తమ గ్రూపు నుంచి ఎక్కువగా వసూలు చేసిన రూ.7,558లను తమ ఫిర్యాదు అనంతరం తిరిగి చెల్లించారన్నారు. సంఘ డైరెక్టర్లు సీతారావమ్మ, సుబ్బారెడ్డి మాట్లాడుతు గ్రామంలోని 80 రైతుమిత్ర గ్రూపులు పీఎసిఎస్‌లో రుణాలు తీసుకున్నారని, పిఎసిఎస్ ఉద్యోగులు వారి నుంచి ఎక్కువ సొమ్ములు కట్టించుకున్నారని ఆరోపించారు. అందుచేత సహకార అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యకార్యదర్శి వివరణ: ఈ విషయమై ముఖ్యకార్యదర్శి వెంకటేశ్వరరెడ్డిని వివరణ కోరగా తనకు తెలియుండా గుమస్తా బంగారయ్య కొన్ని తప్పులు చేశాడని, నాలుగు రైతుమిత్ర గ్రూపులకు అన్యాయం జరిగితే డబ్బు తిరిగి చెల్లించానని తెలిపారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. చిన్నచిన్న తప్పులు జరిగితే సరిదిద్దామన్నారు. నోటీసులు జారీ చేస్తున్నాం: రమణారెడ్డి
రైతుమిత్ర గ్రూపు అధ్యక్షరాలు పుచ్చకాయల శ్రీలక్ష్మీ ఫిర్యాదుతో ఇటీవల విచారణకు వచ్చామని, 2,3 రోజులు పీఎసిఎస్‌లో ఉంటే రెండు గ్రూపుల వారు మాత్రమే వచ్చారని డివిజనల్ కోఆపరేటివ్ అధికారి రమణారెడ్డి తెలిపారు. అన్యాయం జరిగిందనుకున్న వారు స్వచ్ఛందంగా వచ్చి ఫిర్యాదుచేస్తే విచారణ జరుపుతామని అన్నారు. ముఖ్యకార్యదర్శికి, సిబ్బందికి నోటీసులు జారీచేస్తున్నామని చెప్పారు.

నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలి
బంటుమిల్లి, డిసెంబర్ 2: నగదు రహిత ఆర్థిక లావాదేవీలను ప్రోత్సహించాలని తహశీల్దార్ దాసరి విజయశేఖరరావు అన్నారు. శుక్రవారం ఆయన నగదు రహిత సేవలపై పలు ప్రాంతాల్లో జరిగిన అవగాహనా కార్యక్రమాలను పరిశీలించారు. పెదతుమ్మిడి ఇండియన్ బ్యాంక్‌లో క్యాష్ లెస్ విధానం, రూపే కార్డుల పంపిణీ, బ్యాంకర్లు అందిస్తున్న సేవలను పరిశీలించారు. ముంజులూరు, అర్తమూరు, కంచడం గ్రామాల్లో కూడా నగదు రహితపై జరిగిన అవగాహనా కార్యక్రమాలను పరిశీలించారు. రేషన్ దుకాణాలను తనిఖీ చేశారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో డీలర్లతో సమావేశం నిర్వహించి నగదు రహిత రేషన్ పంపిణీపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ ఆర్‌ఐ ప్రసాద్, రేషన్ డీలర్లు పాల్గొన్నారు.