కృష్ణ

‘రియల్’ ఢమాల్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, డిసెంబర్ 2: పెద్దనోట్ల దెబ్బకు రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. ఎంతో మందికి జీవనోపాధి కల్పించిన ఈ రంగం నేడు బోసిపోయింది. గత పదేళ్ళ క్రితం సమాజంలో తీవ్రంగా నెలకొన్న నిరుద్యోగ సమస్యను సైతం అధిగమించిన రియల్ ఎస్టేట్ రంగం పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్‌తో మళ్ళీ ఆ సమస్యను తెచ్చి పెట్టింది. ఈ రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్న ఏజెన్సీలు, బ్రోకర్లు నేడు బజారున పడ్డారు. భూములు, భవంతుల క్రయ, విక్రయాలు పూర్తిగా నిలిచిపోవటంతో ప్రభుత్వ ఆదాయానికి సైతం భారీగా గండి పడుతోంది. ప్రధానంగా నల్లధనంతో సాగే ఈ రంగం నేడు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రధాని మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో బక్కచిక్కిపోయిన రియల్ ఎస్టేట్ రంగం ఎనే్నళ్ళకు కోలుకుంటుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం మరింత ఊపందుకుంది. రాజధాని జిల్లాగా పేరొందిన కృష్ణాజిల్లాలో ఈ రంగం దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది. అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు విజయవాడ- మచిలీపట్నం నాలుగు లైన్ల రహదారి, బందరు ఓడరేవు, పారిశ్రామికవాడ, గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణ, ఇలా అనేక ప్రాజెక్టులు తెర మీదకు రావటంతో ఆయా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా పుంజుకుంది. ఎందుకూ పనికి రాని బీడు పడిన భూములు సైతం కోట్లకు పడగలెత్తాయి. దేశ, విదేశాలకు చెందిన వారు తమ వద్ద ఉన్న నల్లధనంతో ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. నల్లధనాన్ని పోగు చేసుకున్న కుబేరులకు రియల్ ఎస్టేట్ రంగం కేరాఫ్ అడ్రస్‌గా మారింది. తమ అక్రమ సంపాదనను నల్ల కుబేరులు ఈ రంగంలో పెట్టి దాన్ని వైట్‌గా మార్చుకుంటూ వచ్చారు. బినామీ పేర్లతో వందలాది ఎకరాలు, పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్లు కొనుగోలు చేసి బ్లాక్ మొత్తాన్ని వైట్‌గా మార్చుకోవటంతో సామాన్యులు సెంటు భూమి కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ ధరకు ఏ మాత్రం పొంతన లేకుండా మార్కెట్ ధరను అమాంతం పెంచేశారు. 70 శాతం బ్లాక్, 30 శాతం వైట్ మనీతో సాగే ఈ రంగం నేడు నోట్లరద్దు సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటోంది. భవన నిర్మాణ రంగంపై కూడా దీని ప్రభావం కనిపిస్తోంది. భూముల క్రయ, విక్రయాలతో పాటు అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు కూడా రియల్ ఎస్టేట్‌లో ప్రధాన భూమిక పోషిస్తూ వచ్చాయి. అసంఘటిత రంగంలో భవన నిర్మాణ కార్మికులు ప్రధాన శక్తిగా అవతరించారు. ఏ పనులూ లేని కాలంలో కూడా ఎంతోమందికి పనులు కల్పించింది. భారీగా వలస కార్మికులను సృష్టించింది. నిత్యం క్రయ, విక్రయదారులతో కళకళలాడే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు బోసిపోయాయి. ఫలితంగా ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా పడిపోయింది.