కృష్ణ

ఏడాదిలో జగన్ జైలుకెళ్లడం ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, డిసెంబర్ 2: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అధికారం కోసం పగటి కలలు కంటున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు ఎద్దేవా చేశారు. దేవుడు దయదలిస్తే యేడాదిలో తమ ప్రభుత్వం వస్తుందని జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. శుక్రవారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అర్జునుడు మాట్లాడుతూ దేవుడు దయతలిస్తే యేడాదిలో జగన్ జైలుకు వెళ్ళడం ఖాయమన్నారు. లక్ష కోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ బెయిల్ మీద తిరుగుతున్న జగన్ త్వరలోనే జైలుకు వెళతారని, ఇది తెలియక అధికారం కోసం పగటి కలలు కంటున్నారని విమర్శించారు. బందరు పోర్టు, కారిడార్‌ను జిల్లా వాసులంతా స్వాగతిస్తుంటే జగన్ మాత్రం తన స్వార్థ రాజకీయాల కోసం వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షిస్తూ పోర్టుతో పాటు అనుబంధ పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నారన్నారు. కాకినాడలో పోర్టు ఉన్నా అనుబంధ పరిశ్రమలు లేనందున ఆ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. విశాఖపట్నంలో ఓడరేవుతో పాటు అనుబంధ పరిశ్రమలు ఉండటంతో ఆ ప్రాంతం దినదినాభివృద్ధి చెందుతోందన్నారు. ఒక్క పోర్టుతోనే అభివృద్ధి సాధ్యం కాదన్నారు. అందుకే మచిలీపట్నంలో పోర్టుతో పాటు పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. దీన్ని జీర్ణించుకోలేని ప్రతిపక్షంలో లేనిపోని ఆరోపణలు చేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటోందని విమర్శించారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ళ జగన్నాథరావు (బుల్లయ్య) మాట్లాడుతూ అభివృద్ధికి ప్రధాన ఆటంకి జగన్మోహనరెడ్డి అన్నారు. గత పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో ఈ ప్రాంతం అన్ని విధాలా వెనుకబడిందన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన అవినీతికి ఐఎఎస్ అధికారులు జైలు జీవితం గడపాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. పోర్టు, పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూములను ఇచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారన్నారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ ఈ ప్రాంత రైతులకు వరం లాంటిదన్నారు. మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ మాట్లాడుతూ బందరు పోర్టు ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమన్నారు. పోర్టు కల సాకారమవుతున్న తరుణంలో ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు బాధాకరమన్నారు. ఈ సమావేశంలో పార్టీ పట్టణాధ్యక్షులు ఇలియాస్ పాషా, పివి ఫణి కుమార్ తదితరులు పాల్గొన్నారు.