కృష్ణ

పల్టీకొట్టిన ఇన్నోవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట రూరల్, డిసెంబర్ 2: విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై తెలంగాణ-ఆంధ్ర సరిహద్దు ప్రాంతం అయిన గరికపాడు వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా, మరో ఐదుగురికి గాయాలు అయ్యాయి. హైదరాబాద్ కుకట్‌పల్లికి చెందిన ఏడుగురు వ్యక్తులు ఇన్నోవా వాహనంలో తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలోని ఒక ఆశ్రమంకు వెల్తున్నారు. తెలంగాణ సరిహద్దు దాటి ఆంధ్రా సరిహద్దు గరికపాడుకు ఇన్నోవా వాహనం ప్రవేసించి ఆతి వేగానికి అదుపు తప్పి రోడ్డు ఎడమ వైపు ఉన్న డివైడర్‌ను డీకొట్టి అక్కడినుండి 3 పల్టీలు కొట్టుకొంటూ కొంతదూరం వెళ్లి సెంటర్ డివైడర్‌కు తల్లకిందులుగా బొల్తా పడింది. వాహనం పూర్తిగా దెబ్బతినగా వాహనంలో ప్రయాణిస్తున్న ఏడుగురులో కొంతమంది రోడ్డుపైన, మరికొంత మంది రొడ్డుకు దూరంగా ఉన్న లోయలో ఎగిరి పడ్డారు. అదే సమయంలో సరిహద్దులో జగ్గయ్యపేట సిఐ లచ్చునాయుడు ఆధ్వర్యంలో సర్కిల్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అదుపు తప్పిన ఇన్నోవా దాదాపు వారి సమీపంలోకి దూసుకు రావటంతో ప్రమాదాన్ని పసి గట్టిన పోలీసులు అప్రమత్తమై పక్కకు తప్పుకున్నారు. తేరుకున్న పోలీసులు వెంటనే సహాయ చర్యల్లో నిమగ్నమై క్షతగాత్రులను 1033 హైవే అంబులైన్స్‌లోను, ఆటోలోను, జగ్గయ్యపేట ప్రభుత్వ ఆశుపత్రికి తరలించారు. ప్రమాద సంఘటనతో హైవేపై కొద్ది సేపు ట్రాఫిక్ నిలచిపోయింది. ఏడుగురు ప్రయాణికుల్లో నట్టా మురళీకృష్ణ (45) జగ్గయ్యపేట ప్రభుత్వ ఆశుపత్రికి తీసుకు వచ్చే సమయానికి మృతి చెందగా, సింహాచలం అనే వ్యక్తి తలకు బలమైన గాయాలు అయి అపస్మారక స్థితికి వెల్లారు. అతనికి స్థానికంగా చికిత్స అనంతరం మెరుగైన చికిత్సకు విజయవాడ తరలించారు. గాయపడిన వారిలో వాహనం నడుపుతున్న మొగిళి శ్రీనివాస్, తూము ఆనంద్, లాకునూరు జగదీశ్వరావు, బట్లపెనుమర్తి సత్యనారాయణ, లేజెండ్ల రాజా ఉన్నారు. వారికి స్థానికంగా చికిత్స నిర్వహించారు. అతి వేగంగా ఉన్న ఇన్నోవా వాహనంకు బైక్ అడ్డు రావటంతో దానిని తప్పించే విషయంలో స్టీరింగ్ అదుపు తప్పి ప్రమాదం జరిగినట్లు బాధితులు తెలిపారు. చిల్లకల్లు ఎస్సై వంశీకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.