కృష్ణ

పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిగామ: సరైన ప్రణాళిక, ప్రజల ఇబ్బందులను అంచనా వేయకుండా 86 శాతం చలామణిలో ఉన్న 500, 1000 నోట్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోడి రద్దు చేయడంతో దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దేశ ఆర్థిక వ్యవస్థే కూదేలైందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్ల ధనం నిర్మూలనకు తమ పార్టీ కానీ, నాయకులు గానీ వ్యతిరేకం కాదన్నారు. అయితే నల్లధనం నిర్మూలన పేరుతో పెద్ద నోట్లను రద్దు చేసి ప్రజలను ఇబ్బందుల పాల్జేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అమలు చేయడంలో లోపాలు ఉంటే ఎంతటి సంచలనాత్మక నిర్ణయాలైనా అభాసుపాలు అవుతాయనడానికి ఇది నిదర్శనమన్నారు. అభివృద్ధి చెందిన, అక్షరాస్యతా శాతం అధికంగా ఉన్న దేశాల్లోనే నగదు రహిత లావాదేవీలకు ఏన్మో ఏళ్లు పట్టిందని, అటువంటిది అభివృద్ధి చెందుతున్న మన దేశంలో నగదు రహిత లావాదేవీలు ఇప్పటికిప్పుడు సాధ్యమా అని ప్రశ్నించారు. సరిపడ నగదు ఇవ్వక, ఎటిఎంలు పనిచేయక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల కష్టాలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

చరిత్ర పుటల్లో చెరగనిముద్ర ‘రాంజీ’ హైస్కూల్
మచిలీపట్నం (కల్చరల్): సమాజానికి ఎంతో మంది మేధావులు, విద్యావంతులను అందించిన స్థానిక రాంజీ మున్సిపల్ హైస్కూల్ చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రాంజీ హైస్కూల్ శత వసంతోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి కొల్లు రవీంద్ర హైస్కూల్ వ్యవస్థాపకులు వేమూరి రాంజీరావు పంతులు కాంస్య విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి రవీంద్ర మాట్లాడుతూ సమాజంలో అసమానతలు తొలగించే విధంగా రాంజీ పంతులు విద్యను ప్రోత్సహించారన్నారు. ఆయన స్థాపించినవిద్యాలయంలో వంద సంవత్సరాల వేడుక జరుపుకోవడం హర్షణీయమన్నారు. ఆయన ఆశయ సిద్ధి కోసం అంకితభావంతో కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, జెడ్పీటిసి లంకే నారాయణ ప్రసాద్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ సింగ్, పిఇటి సుభాషిణి, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.