కృష్ణ

పర్యాటక కేంద్రంగా మంగినపూడి బీచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, డిసెంబర్ 19: మంగినపూడి బీచ్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సోమవారం బీచ్ వద్ద అభివృద్ధిపై పర్యాటక శాఖాధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంగినపూడి బీచ్‌కు పర్యాటకుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే బీచ్ ఫ్రంట్ ఏరియాను మెరక చేసి అభివృద్ధి పర్చామన్నారు. రిసార్ట్స్‌తో పాటు గ్రీనరీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, జెడ్పీటిసి లంకే నారాయణ ప్రసాద్, మార్కెట్ యార్డు చైర్మన్ గోపు సత్యనారాయణ, టూరిజం అభివృద్ధి సంస్థ ఎస్‌ఇ పి వెంకటేశ్వర్లు, డిఇ గోవిందరెడ్డి, జియం రమణారెడ్డి, ఎంపిడివో జివి సూర్యనారాయణ, తహశీల్దార్ బి నారదముని, టిడిపి మండల అధ్యక్షుడు తలారి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనాన్ని
విజయవంతం చేయాలి: ఆనంద్
కూచిపూడి, డిసెంబర్ 19: రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 5వ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనానికి కళాభిమానులు, కళాకారులు, అభిమానులు తరలిరావాలని సిలికానాంధ్ర వ్యవస్థాపక చైర్మన్ కూచిభొట్ల ఆనంద్ పిలుపు నిచ్చారు. సోమవారం స్థానిక సిలికానాంధ్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 23, 24, 25 తేదీలలో రాష్ట్ర భాష, సాంస్కృతిక శాఖ, సిలికానాంధ్ర సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి అతిరథ, మహారథులైన కూచిపూడి నాట్యాచార్యులు, వారి శిష్య బృందాలు 7వేల మందికి పైగా ఈ కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చేందుకు తరలి వస్తున్నారన్నారు. 25వ తేదీ ఆదివారం సాయంత్రం 6గంటలకు నిర్వహించే మహా బృంద నాట్యం ఐదవ విడత గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులలో నమోదవుతుందన్నారు. 23వ తేదీన ఉదయం 8.30గంటలకు కూచిపూడి శోభాయాత్ర, ధ్వజారోహణం, 9గంటలకు కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత వేదాంతం రాధేశ్యాం శిష్యబృందం కూచిపూడి నాట్య పూర్వరంగంతో నాట్యోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. సామూహిక కీర్తనాగానం, పద్మభూషణ్ డా. స్వప్నసుందరి, పద్మశ్రీ డా. శోభానాయడు, పద్మశ్రీ జయరామారావు, కేంద్ర సంగీత నాటక అకాడమి అవార్డు గ్రహీత వనశ్రీరావు, నాట్య వసుందర అనుపమామోహన్ అయ్యప్ప జననం కూచిపూడి నృత్య రూపకం, కేంద్ర, సంగీత నాటక అకాడమి అవార్డు గ్రహీత డా. జి పద్మజారెడ్డి శక్తి అంశం, పద్మభూషణ్ డా. వెంపటి చినసత్యం కుమార్తె చావలి బాలాత్రిపుర సుందరి బృందం గణేష్, నటరాజ స్తుతి అంశాలు, డా. అలైక్య పుంజాల, డా. శ్రీకళాజ్వాలా బృందం దివంగత డా. ఉమారామారావుకు నివాళుల నృత్యం ఉంటాయన్నారు. సంగీత నాటక అకాడమి అవార్డు గ్రహీత డా. వేదాంతం రామలింగశాస్ర్తీ యక్షగాన ప్రదర్శన, డా. భాగవతుల శేతురాం, డా. జయంతి రమేష్ బృంద నృత్యం, డా. పప్పు వేణుగోపాలరావు, పద్మశ్రీ శోభానాయుడు శిష్యబృందం, భాగవతుల వెంకట రామశర్మ, కెవి భార్గవ కుమార్, అజయ్, అనంతలక్ష్మి, తిలగావతి, ఉమారాణి, వెంపటి శ్రావణి, జిలానీ భాషా, రఘుపాత్రుని శ్రీకాంత్ బృందాల కూచిపూడి నృత్య ప్రదర్శనలు, పసుమర్తి రామలింగశాస్ర్తీ నృత్య రూపకం ప్రదర్శించనున్నట్లు ఆనంద్ తెలిపారు.

కలెక్టర్‌ను కలసిన ఆనందపురం హైవే నిర్వాసితులు
ఉయ్యూరు, డిసెంబర్ 19: విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారి అభివృద్ధితో నిర్వాసితులవుతున్న మండలంలోని గండిగుంట, ఆనందపురం నిర్వాసితులు దళిత ఐక్య వేదిక ఆధ్వర్యంలో సోమవారం మచిలీపట్నంలోని కలెక్టర్‌ను కలసి తమకు న్యాయం చెయ్యవలసినదిగా విజ్ఞప్తి చేశారు. ఈ గ్రామాల్లోని గ్రామకంఠం కిందవున్న సర్వే నెంబర్ 904లో ఉన్న నిర్వాసితులు అందరూ దళిత సామాజిక వర్గాలకు చెందిన వారని, గ్రామకంఠ కింద ఉండటంతో నష్టపరిహారం విషయంలో తాత్సారం జరగడమేగాక, మిగిలినవారికి అందిన దానికన్నా తక్కువ పరిహారమిస్తామని అధికారులు తెలుపుతున్నారని వారు కలెక్టర్‌కు సమర్పించిన విజ్ఞాపన పత్రంలో పేర్కొన్నారు. హైవే అధికారులను అడిగితే ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేస్తామని చెబుతున్నారని, కాంట్రాక్టర్లు ఇళ్ళు కాళీ చెయ్యవలసినదిగా వత్తిడి తెస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలినవారితో పాటే నష్ట పరిహారం అందిస్తే ఆ సోమ్ముతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటామని వారు కలెక్టర్‌కు తెలిపారు. స్పందించిన కలెక్టర్ ప్రస్తుతం ఉన్న నోటిఫికేషన్‌ను అదనపు ఉత్తర్వులను జతపరచి వెంటనే నష్టపరిహారం అందేలా చూడాలని ఉయ్యూరు తాహశీల్దార్‌ను ఆదేశిస్తామని హామీ ఇచ్చినట్లు నిర్వాసితులకు నాయకత్వం వహించిన తెలుగుయువత జిల్లా నాయకులు కొండా ప్రవీణు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు నాగకుమార్, వల్లే నాగశ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.