కృష్ణ

అనధికార నిర్మాణాల ముక్కు పిండేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 15: నగర పాలక సంస్థ పరిధి ప్రాంతాల్లో నిర్మితమవుతున్న అనధికార నిర్మాణాలపై విఎంసి కమిషనర్ వీరపాండియన్ పట్టు వదలలేదు. ఈనెల 4న జరిగిన కౌన్సిల్ సమావేశంలో కో-ఆప్షన్ మెంబర్ చెన్నుపాటి ఉషారాణి ప్రతిపాదించిన విషయంపై జరిగిన చర్చలో పార్టీలతో సంబంధం లేకుండా సభ్యులందరూ వ్యతిరేకించడమే కాకుండా కౌన్సిల్ సభకు అధ్యక్షత వహించిన మేయర్ కోనేరు శ్రీ్ధర్ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేయడమే కాకుండా వసూలును నిలిపేయాలంటూ సూచించిన క్రమంలో కమిషనర్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొంటారని భావించిన ప్రజాప్రతినిధులకు ఆశాభంగమే కలిగిందనే చెప్పాలి. లక్షల రూపాయల వ్యయంతో నిర్మించుకొంటున్న భవనాలపై మరలా మార్కెట్ విలువపై పదిశాతం ఫైన్ వసూలు చేస్తున్న కమిషనర్ నిర్ణయంతో నగరపాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత చాటి పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుందన్న భావనను మేయర్ శ్రీ్ధర్ వ్యక్తం చేయడమే కాకుండా ఈవిషయంపై ప్రభుత్వంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుందామని, అప్పటి వరకూ ఫైన్ వసూళ్లను నిలిపేయాలన్న మేయర్ సూచనను సైతం కమిషనర్ పక్కన పెట్టి ఫైన్ వసూళ్లను యథాతథంగా కొనసాగిస్తున్న వైనం గమనార్హం. కాగా నగర పాలనపై కీలక నిర్ణయాలు తీసుకొనే కౌన్సిల్‌కు ఆయా నిర్ణయాలను అమలుచేయాలన్న అధికారుల మధ్య పొంతన లేని వ్యవహారం జరుగుతోందన్న విషయం స్పష్టమవుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్ట సభల ద్వారానే ప్రజా పాలన సాగుతుందన్న విషయం వేరే చెప్పనక్కర్లేదు. అయితే స్థానిక సంస్థల విషయానికి వచ్చే సరికి అధికారిక పాలన సాగించే కమిషనర్‌కే ఉన్నతాధికారాలు ఉంటాయా లేక ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు ఉంటుందా అన్న విషయంపై చర్చలు జరుగుతున్నాయి. కౌన్సిల్ వద్దన్నా కమిషనర్ వసూలు చేయాలన్న నిర్ణయించడాన్ని చూస్తుంటే ఎవరి అధికారాలు ఎంతెంత అన్నది తేల్చాసి ఉందంటూ వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలావుండగా కమిషనర్ ఇచ్చిన ఆదేశాలను సైతం టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు తమదైన శైలిలో మలచుకొంటున్నారు. అనధికార రెండు, మూడు అంతస్తులకు అనుమతించేందుకు గాను నాడు లక్షల లక్షలను దిగమింగిన బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు, చైన్‌మెన్లు ఇప్పుడు కమిషనర్ ఆదేశాలను అడ్డం పెట్టుకొని మరలా అక్రమ వసూళ్లకు దిగుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనధికార నిర్మాణాలపై ఇప్పటివరకూ కోటి 6 లక్షల రూపాయలను వసూలు చేసినట్టు అధికారిక లెక్కలే తెలుపుతున్నాయి. అనధికార రెండు, మూడు అంతస్తుల నిర్మాణాలపై కౌన్సిల్‌లో మేయర్ శ్రీ్ధర్ మరో సూచన కూడా చేశారు. వీటి నిర్మాణాలకు అనుమతించే విషయం ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. గతంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో నగరంలో పెరుగుతున్న నివాస సమస్యను పరిష్కరించేందుకు గాను రెండో అంతస్తు నిర్మాణానికి అనుమతించాలంటూ గతంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో జరిగిన ఏకగ్రీవ తీర్మాన ఆమోదాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని మరికొద్ది రోజుల్లో రెండో అంతస్తు నిర్మాణాలకు అనుమతులొచ్చే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తుండగా ఈలోపుగా నిర్మితమైయ్యే నిర్మాణాలకు రిటన్ ప్లాన్ దరఖాస్తు చేయించి అందుకు ప్లాన్ ప్రకారం చెల్లించాల్సిన రుసుమును జమ చేయించడం వలన విఎంసి ఖజానాకు ఆదాయం చేకూరడమే కాకుండా ప్రజల నుంచి కూడా వ్యతిరేకత రాదన్న విషయాన్ని గుర్తించాలంటూ మేయర్ చేసిన ప్రతిపాదనను సైతం కమిషనర్ వీరపాండియన్ లెక్కచేయలేదన్న విషయం ప్రస్తుతం వసూలు చేస్తున్న విధానంపై స్పష్టమవుతోంది. ఈవిషయంపై మేయర్ కోనేరు శ్రీ్ధర్ తీవ్ర అసహనంతో ఉండగా కమిషనర్ తీరును నిరసిస్తూ ఆయనపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. నగరంలోనే కాక రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా ఒక్క విజయవాడ నగరంలోనే అనధికార నిర్మాణాలకు మార్కెట్ విలువ లెక్కకట్టి దానిపై పదిశాతం అపరాధ రుసుం వసూలు చేయాలన్న కమిషనర్ వీరపాండియన్ నిర్ణయం ఆయన నియంతృత్వ అధికారిక పోకడలకు నిదర్శనమన్న వాదనలు కార్పొరేటర్లు బహిరంగంగానే వినిపిస్తున్నారు.