కృష్ణ

మట్టానికి నీటిమట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీ, ఏప్రిల్ 15: పూర్వకాలంలో బెజవాడ.. ప్రస్తుత విజయవాడ రానురాను అమరావతి రాజధానిలో భాగమైంది. నాడు విజయవాడ పక్కనే కృష్ణా అనే జీవనది ఉండేది చరిత్ర ఆధారాల ప్రకారం ఆ జీవనది సాగునీటికి, మంచినీటికి ఆధారమైయ్యేది. రానున్నకాలంలో ఇలాంటి చరిత్ర చదువుకోవాల్సిన పరిస్థితి రానుందా అని భయపడేంతగా కృష్ణానది నీటిమట్టం దిగజారింది. కనీస నీటి మట్టానికి ఆరడుగులు పడిపోయింది. ప్రకాశం బ్యారేజి నిర్మించిన తరువాత ఏప్రిల్ 15, 2016 నాటికి నీటిమట్టం శుక్రవారం ఉదయం 6.4 అడుగులు ఉండగా మధ్యాహ్నం 6.3 అడుగులకు దిగజారింది. నీటి పారుదలశాఖ రికార్డులో ఇంత దారుణంగా నమోదైన సంఘటన ఇంతకు ముందెన్నడూ లేదు. పాలకుల అనాలోచిత చర్యలు నదీజలాలల నియంత్రణ తదితర అంశాలపై సంపూర్ణమైన అవగాహన లేక వర్షాలు బాగున్నప్పుడు ఉప్పొంగే నదుల జీవ జలాలు ఉప్పు సముద్రం పాలైయ్యాయి. వర్షాలు లేని సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకుడు గుంటల గూర్చి ప్రచారం చేస్తుంది. అంతకు ముందే పూడికకు గురైన జీవనదుల్లోని పూడిక తీయించాలనే సూచనలను కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టింది. సుమారు రెండు నెలల క్రితమే ఆంధ్రభూమిలో ‘నీటి యుద్దాలు తప్పవా’ అంటూ కథనం ప్రచురించిన విషయం విధితమే. సుమారు 12ఏళ్ల క్రితమే జాతీయ విపత్తుల నివారణ సంస్థ ఉపాధ్యక్షులు మర్రి శశిధరరెడ్డి దేశంలోని నదులు పూడికకు గురయ్యాయని ప్రతి నదీ పూడిక తీయించాలని అప్పుడే నదీ పరివాహక ప్రాంతంలో సాగు, మంచినీరు నిల్వలు ఉంటాయని నివేదిక అందించారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నివేదికను పట్టించుకోలేదు. మామూలుగా సాగునీరు, సరఫరా చేస్తున్న పంట కాలువలు సైతం ఇసుక మట్టి, రబ్బీసులను పూడికకు గురవుతుంటాయి. ప్రతి వేసవికాలంలోనూ గ్రామస్థాయి, పంచాయతీస్థాయి, మండల నియోజకవర్గాల స్థాయిలో పంట కాలువలను పనికి ఆహార పథకం కింద తవ్వించి కరకట్టలు పోయిస్తున్నారు. అలాంటిది వేలాది ఏళ్ల క్రితం నుండి ప్రవహిస్తున్న నదుల్లో ఒండ్రు, ఇసుక, వ్యర్థాలతో పూడుకుపోయినా ఏనాడూ వాటి పూడికను తీయించలేదు. పైగా దేశంలోనే తొలిసారిగా చరిత్రలో నిల్చిపోయారూ అంటూ ఊదరకొట్టు ఉపన్యాసాలతో నదుల అనుసంధానంపై జబ్బలు చరుచుకుంటున్న తెలుగుదేశం పాలకులు నదుల్లో జీవజలాలే లేనప్పుడు ఇక అనుసంధానానికి కేటాయించిన వేలాది కోట్ల రూపాయలల నిధులు అటు గోదావరి, ఇటు కృష్ణానది మధ్య కాలువల్లో నిమజ్జనం చేసినట్టయ్యిందనే విమర్శలు వినవస్తున్నాయి. ఏదిఏమైనా నార్ల తాతారావు విద్యుత్ ఉత్పాదక కేంద్రం పని చేయాలంటే ప్రకాశం బ్యారేజి వద్ద 12 అడుగుల నీటిమట్టం ఉండాలి అదీ ఆవిరైంది. గుంటూరు, కృష్ణా జిల్లాలకు మంచినీరు అందించాలన్న గాని కనీసం నీటిమట్టం 8 అడుగులైన ఉండాలి, ఏప్రిల్ 15నాటికే నీటిమట్టం 6.3 అడుగులకు పడిపోయిదంటే వచ్చేనెల మంచినీరు ఎండమావులేనా అన్పిస్తుందని ప్రజలు భయాందోళనకు గురౌతున్నారు.