కృష్ణ

రౌడీషీటర్లకు రాజకీయ అండ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఏప్రిల్ 15: గతంలో రౌడీయిజం చెలాయించిన వారు ఆతర్వాత రాజకీయ అవతారమెత్తేవారు. కాని ఇప్పుడు రౌడీషీటర్లకు రాజకీయ పార్టీల అండదండలు పుష్కలంగా అందుతున్నాయి. ఇందుకు ఏ ఒక్క రాజకీయ పార్టీకి మినహాయింపు లేదు. అధికార పక్షమైనా.. ప్రతిపక్ష పార్టీ అయినా ఆయా పార్టీలో ఉండే కొంతమంది కీలక నాయకుల కనుసన్నల్లో ఈ కరుడుగట్టిన రౌడీషీటర్లు హల్‌ఛల్ చేయడం నగరంలో పరిపాటిగా మారిపోయింది. ఇప్పుడు జనం ఇదే విషయంపై ముక్కున వేలుసుకుంటున్నారు. రౌడీషీటర్లకు అండగా ఉంటున్న రాజకీయ నేతల వ్యవహార శైలిని ఏవగించుకుంటున్నారు. షీటర్లకు నాయకులు వత్తాసా అంటే ఇదేమీ ఆరోపణలు కావు. సాక్షాత్తు నిలువెత్తు నిజాలే. ఇందుకు సెంట్రల్, తూర్పు, పెనమలూరు ఇలా ఏ ఒక్క నియోజకవర్గం తీసిపోలేదు. ఒక రౌడీషీటర్ స్థానిక స్టేషన్ పరిథిలో చలాయించేందుకు స్థానిక నేతలు సహకారం ఉంటుందనడంలో ఏమాత్రం సందేహమే లేదు. ఇందుకు స్థానిక పోలీసులే ఊ.. కొడుతున్నారు. ఏ గ్రేడ్ రౌడీషీటర్ అయితే ఎమ్మెల్యే లేదా మాజీ ఎమ్మెల్యే స్థాయి నాయకుడే నేరుగా లైన్‌లోకి వచ్చేస్తాడనేది జనం గట్టిగా నమ్ముతున్నారు. రాజకీయ జోక్యంతో రౌడీషీటర్ల పట్ల పోలీసులు కఠిన వైఖరి అనుసరించలేకపోతున్నారనే వాదన కూడా ఉంది. అయితే దీన్ని సాకుగా పోలీసులు చేష్టలుడిగి దిక్కులు చూడటం సరి కాదని కూడా జనాభిప్రాయం. రౌడీషీటర్లను పూర్తిగా నియంత్రించాల్సిన బాధ్యత టాస్క్ఫోర్స్‌దే. ఈ విభాగం నేరుగా నగర పోలీసు కమిషనర్ కనుసన్నల్లో నడుస్తుంది. అయితే సీపి స్థాయి అధికారి ప్రతిసారీ చూడటం సాధ్యం కాదు. అంటే టాస్క్ఫోర్స్ అధికారులే క్షేత్ర స్థాయిలో రౌడీషీటర్ల కదలికలపై నిఘా ఉంచి వారిని నియంత్రించాల్సి ఉంటుంది. ఇక్కడే టాస్క్ఫోర్స్ విఫలమైన విషయం కమిషనరేట్ పెద్దలే అంగీకరిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే టాస్క్ఫోర్స్‌పై ఆ స్థాయిలో రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయా అనే అనుమానం కలుగకమానడం లేదు. ఒకవేళ లేదంటే టాస్క్ఫోర్స్ ఉదాసీనతే కావచ్చు కూడా. మొత్తం ఖల్ నాయక్, కొక్కిలగడ్డ జాన్, నెలటూరి రవి, థియోడర్, ఇలా ఏ గ్రేడ్ రౌడీషీటర్లకు నియోజకవర్గ స్థాయిలో రాజకీయ నేతల దీవెనులు ఉన్నాయనడంలో సందేహమే లేదని కమిషనరేట్ నిఘా వర్గాలు కూడా భావిస్తున్నట్లు సమాచారం. ఈక్రమంలోనే పెనమలూరు రౌడీషీటర్ కొక్కిలగడ్డ జాన్‌కు రాజకీయ అండదండలు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. లేకుంటే అంత ధైర్యంగా హత్యాయత్నంకు ఒడిగట్టే వాడు కాదని సమాచారం. పెనమలూరు పోలీస్టేషన్ పరిథిలో తలెత్తిన బ్యానర్ల వివాదాన్ని పురస్కరించుకుని పటమట పోలీస్టేషన్ పరిథిలో మందిబలంతో కత్తిపోట్లకు పాల్పడటం పట్ల పోలీసులు అంత తేలీకగా పరిగణించడం లేదు. దీనిలో భాగంగానే ఈ వ్యవహారంపై నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ తీవ్రంగా స్పందించారు. టాస్క్ఫోర్స్‌తోపాటు, సెంట్రల్, వెస్ట్ జోన్ల అధికారులపై ఆయన సీరియస్ అయినట్లు తెలియవచ్చింది. దీంతో రంగంలోకి దిగిన డిసిపి కాళిదాసు రంగారావు శుక్రవారం సాయంత్రం పటమట పోలీస్టేషన్‌కు చేరుకుని గంటపాటు ఈ ఉదంతంపై అధికారులతో సమీక్షించారు. అదుపులో ఉన్న కొక్కిలగడ్డ జాన్ మరో ఆరుగురిని వాహనంలో కామయ్యతోపు బ్యానర్ల వివాద స్ధలం, అదేవిధంగా హత్యాయత్నం జరిగిన పటమట ప్రాంతానికి తీసుకెళ్లి విచారించారు. షీటర్ అనుచరగణం పట్ల పోలీసులు తమదైన శైలితో వ్యవహరించినట్లు సమాచారం. దీంతో నిందితుల అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ కేసులో ఏడుగురు నిందితులను శనివారం అరెస్టు చూపే అవకాశం ఉంది. వీరితోపాటు జాన్ తమ్ముడు స్టాలిన్‌తోపాటు మరో ఇద్దరు కోసం గాలిస్తున్నారు. కాగా ఈఘటన నేపధ్యంలో స్టేషన్ల పరిథిలో బీట్లు పెంచాలని, నిఘా పటిష్టం చేయాలని డిసిపి స్టేషన్ సిఐలను ఆదేశించారు. డిసిపి వెంట లా అండ్ ఆర్డర్, క్రైం ఏసిపిలు ఇతర అధికారులున్నారు.