కృష్ణ

చూడముచ్చటగా సీతారాముల కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, ఏప్రిల్ 15: శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని శుక్రవారం పటమటలోని వాడవాడల సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. 2వ డివిజన్ రామచంద్రనగర్‌లో జరిగిన సీతారాముల కళ్యాణ కార్యక్రమానికి హాజరైన గద్దె, ఎమ్మార్ రాజా అందజేసిన 100 చీరలను పేదలకు పంపిణీ చేశారు. పటమటలంక సీతారామనగర్‌లో ఏర్పాటు చేసిన సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సి.పి.గౌతమ్ సవాంగ్, గద్దె రామమోహన్ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 11వ డివిజన్ ఎలక్ట్రిసిటీ కాలనీ, జెడి నగర్, ఆర్‌టిసి కాలనీలలో జరిగిన వేడుకలలో గద్దె పాల్గొన్నారు. దర్శిపేటలో జరిగిన శ్రీరామనవమి వేడుకలలో గద్దె రామమోహన్ బెల్లం కొట్టి పానకం కలిపారు. 13వ డివిజన్ పటమటలంక రామాలయం, గ్రీన్‌ల్యాండ్ హోటల్ దగ్గర ఏర్పాటు చేసిన వేడుకలలో గద్దె పూజలు నిర్వహించారు. 6వ డివిజన్ వాటర్ ట్యాంక్ వద్ద, 8వ డివిజన్ గాయత్రి నగర్ వద్ద 2వ డివిజన్ శ్రీనివాస బ్యాంక్ కాలనీ, వాసవి నగర్, ఆర్‌టిసి కాలనీ, నిర్మలా కానె్వంటు ప్రక్కన భద్రయ్యనగర్, పటమట సెంటర్, రఘు గార్డెన్స్ తదితర ప్రాంతాలలో జరిగిన శ్రీరామనవమి వేడుకలకు గద్దె రామమోహన్ హాజరై పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గనే్న వెంకట నారాయణ ప్రసాద్, చెన్నుపాటి గాంధీ, ముమ్మనేని ప్రసాద్, చలసాని రమణ, సహేరా బాను, తదితరులు పాల్గొన్నారు.