కృష్ణ

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు మహదానందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం, జనవరి 12: గన్నవరం ఎయిర్‌పోర్టుకు నందమూరి తారక రామారావు నామకరణం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన సూచన తనకు మహాదానందం కల్గించిందని కేంద్ర విమానయానశాఖ మంత్రి పి అశోక్‌గజపతిరాజు అన్నారు. గురువారం మధ్యాహ్నం గన్నవరం ఎయిర్‌పోర్టులో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ నామకరణం చేయాలంటే అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్‌కు పంపాలన్నారు. పార్లమెంట్‌లో తన మిత్రుల సహకారంతో వారిని ఒప్పించేందుకు కృషి చేస్తానన్నారు. ఎన్టీఆర్ నామకరణం ఖరారయ్యేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. న్యూ టెర్మినల్ భవనంలో మీడియా పాయింట్ ఏర్పాటు చేయాలని ఏపిడబ్ల్యుజె నియోజకవర్గ అధ్యక్షులు అట్లూరి రాజశేఖర్ కోరగా సెక్యూరిటీ సమస్య ఉన్నందున లోపల వీలుపడదని, లాంజ్ రూం వెలుపల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

కోలాహలంగా న్యూటెర్మినల్ భవన ప్రారంభం
గన్నవరం, జనవరి 12: గన్నవరం ఎయిర్‌పోర్టులో అంతర్జాతీయ ప్రమాణాలతో రూ. 150 కోట్ల వ్యయంతో నిర్మించిన న్యూ టెర్మినల్ భవన ప్రారంభోత్సవం గురువారం కోలాహలంగా జరిగింది. టెర్మినల్‌ను గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు జాతికి అంకితం చేశారు. 1942 సంవత్సరం బ్రిటీష్ వారి హయాంలో దీనిని నెలకొల్పారు. బస్‌స్టాండ్ కన్నా హీనంగా ఉన్న గన్నవరం ఎయిర్‌పోర్టును ఆధునాతన సౌకర్యాలతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు. కేవలం 14 నెలల సమయంలో నిర్మాణం పనులు విజయవంతంగా పూర్తి చేసిన కాంట్రాక్టర్‌ను, సహకరించిన అధికార్లను, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎంతో విలువైన భూములు ఇచ్చిన రైతులను సిఎం చంద్రబాబు అభినందించారు. రైతులు భూములు ఇవ్వడం వల్లే ఎయిర్‌పోర్టు విస్తరణ కార్యక్రమం వేగవంతంగా పూర్తి చేయగలిగామని, రైతులకు సిఎం పాదాభివందనం చేస్తున్నాని అన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకంతో పోలవరం కాల్వ ద్వారా గోదావరి జలాలను రప్పించి రైతులకు అందించి, తమ పంటలను కాపాడిన అపరభగీరథుడు చంద్రబాబును కృష్ణాజిల్లా తెలుగు రైతు అధ్యక్షులు చలసాని ఆంజనేయులు ఆధ్వర్యంలో గజమాలతో సత్కరించారు. రైతులకు కేంద్ర మంత్రులు ఎం వెంకయ్య నాయుడు, వై సుజనా చౌదరి, బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు డాక్టర్ కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, ఎంపిలు కొనకళ్ల నారాయణరావు, కేసినేని నాని, ఎమ్మెల్యే డాక్టర్ వంశీలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఏఐ చైర్మన్ డాక్టర్ గురుప్రసాద్ మెహపత్రా, కార్యదర్శి ఆర్‌ఎం చౌదరి, జిల్లా కలెక్టర్ బాబు ఎ, ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ఎం ముధుసూధనరావు పాల్గొన్నారు.

దివిసీమ చారిత్రక, సాంస్కృతిక చరిత్రకు ఎల్లలు లేవు
* ఉప సభాపతి బుద్ధప్రసాద్
నాగాయలంక, జనవరి 12: సుదీర్ఘ చరిత్ర కలిగిన దివిసీమ ప్రాంత పర్యాటక, సాంస్కృతిక, చారిత్రకతకు ఎల్లలు లేవని రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. స్థానిక శ్రీరామపాదక్షేత్రం వద్ద కృష్ణానది తీరంలో గురువారం సాయంత్రం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో దివిసీమ సాంప్రదాయ రాష్ట్ర స్థాయి పడవల పోటీ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటైన సంక్రాంతి సంబరాలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు పర్యాటక, సాంస్కృతిక కార్యక్రమాలు కేవలం పట్టణ, నగర ప్రాంతాలకే పరిమితమయ్యాయని, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించటం ముదావహమన్నారు. నాగాయలంక వంటి గ్రామీణ ప్రాంతంలో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మల్లికార్జునరావులకు మండలి కృతజ్ఞతలు తెలిపారు. దివిసీమ సుసంపన్నమైన చారిత్రక నేపథ్యం ఉన్నట్లు విశ్వవ్యాప్తంగా ఉన్న భారతీయులకే కాక ఇతర దేశస్తులకు సైతం తెలిసిన విషయమేనని గుర్తు చేశారు. రాష్ట్ర స్థాయిలో పడవ పోటీలు నిర్వహించటం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల నైపుణ్యానికి ప్రాముఖ్యతనిచ్చినట్లైందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రానికి చెందిన మంత్రులు, అధికారులతో పాటు విదేశాలకు చెందిన ప్రముఖులు సైతం రావడం విశేషమన్నారు. సంక్రాంతి సంబరాలలో భాగంగా జానపద నృత్యాలు, గీతాలు, వివిధ విభాగాలలో పడవల పోటీలు, మహిళలకు ముగ్గుల పోటీలు టగ్‌ఆఫ్‌వార్ వంటి పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. సభ అనంతరం విజయవాడకు చెందిన రవి మెలొడిస్ బృందంచే సినీ సంగీత విభావరి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సజ్జా గోపాలకృష్ణ, ఎఎంసి చైర్మన్ మండవ బాలవర్ధనరావు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు బొర్రా వెంకటేశ్వరరావు, తిరుమలశెట్టి మస్తాన్‌రావు, జిల్లా తెలుగు మహిళ కార్యదర్శి తలసిల స్వర్ణలత, డా. ఎవిఎల్ నారాయణ, మండవ బాబూరావు, ఆలూరి శ్రీనివాసరావు, సబ్బినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.