కృష్ణ

పోలీసుల సాక్షిగా రాములోరికి ‘రెండు పెళ్లిళ్లు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఏప్రిల్ 15: బందరు మండలం ఉల్లిపాలెం గ్రామంలోని శ్రీ హేమకోదండ రామాలయం ట్రస్టు బోర్డు వివాదం నేపథ్యంలో శుక్రవారం పోలీసుల పహారాలో సీతారాములకు రెండు విడతలుగా కళ్యాణాలు జరిగాయి. గ్రామానికి చెందిన ఉల్లి విజయ భాస్కరరావు సదరు రామాలయం తమ వంశీయులదంటూ ఇటీవల ట్రస్టు బోర్డు ఏర్పాటు చేయగా గత రెండు రోజుల క్రితం దీన్ని గ్రామస్థులంతా తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడగా బందరు తాలుకా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పోలీసు పికెట్ కూడా ఏర్పాటు చేశారు. ట్రస్టు బోర్డు వివాదాన్ని కళ్యాణోత్సవ అనంతరం పరిష్కరిద్దామని, ఇరువర్గాలు కలిసి కళ్యాణాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని తాలుకా సిఐ మూర్తి ఇరుపక్షాలకు సర్ది చెప్పారు. దీనికి ఇరుపక్షాలు అంగీకరించాయి. అయితే కళ్యాణోత్సవ ఏర్పాట్లపై ట్రస్టు బోర్డుకు చెందిన వ్యక్తులు కళ్యాణానికి ముందు రోజైన గురువారం రాత్రి వరకు గ్రామస్థులకు ఏ ఒక్క సమాచారం ఇవ్వలేదు. ట్రస్టు బోర్డు కలిసి రాకపోవటంతో గ్రామ సర్పంచ్ శ్రీపతి గంగాభవాని ప్రతి ఏటా నిర్వహించే విధంగానే శుక్రవారం ఉదయం 8గంటల సమయంలో స్వామివారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. అయితే దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. ట్రస్టు బోర్డు వారు 12గంటల ముహూర్తం నిర్ణయించగా మీరు ఎందుకు ముందుగా చేస్తున్నారంటూ, ఇది శాంతిభద్రతలకు విఘాతం కల్పించే చర్య అవుతుందని హెచ్చరించారు. దీన్ని గ్రామస్థులంతా ఖండించారు. ట్రస్టు తమతో కలిసి రాకపోవటంతోనే తాము కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నామంటూ వాదించారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్ నారదముని కూడా ఆలయం వద్దకు వచ్చి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నం చేశారు. గ్రామస్థులు చేసిన కళ్యాణం తర్వాత మరో గంటకు ట్రస్టు బోర్డు సభ్యులు స్వామివారికి మళ్ళీ కళ్యాణం చేశారు. దీంతో ఒకే ఆలయంలో రెండు విడతలుగా అదీ పోలీసుల సమక్షంలో స్వామివారికి కళ్యాణం నిర్వహించడం విశేషం.