కృష్ణ

అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్), ఏప్రిల్ 15: శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని పలు రామాలయాలు, రామ మందిరాలు, కూడళ్ళల్లో ఏర్పాటు చేసిన చలువ పందిళ్ళల్లో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరిగాయి. కళ్యాణ వైభోగమే.. శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి.. తదితర భక్తి పాటలతో ఆలయాలు మార్మోగాయి. స్థానిక రుస్తుంబాద భద్రాద్రి శ్రీరాముల వారి ఆలయంలో వెంకటకూర్మాచార్యులు, మురళీ బ్రహ్మత్వంలో కూనపరెడ్డి రవీంద్రనాధ్ ఠాగూర్, కూనపరెడ్డి కృష్ణారావు సతీసమేతంగా స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు ఉత్పల కృష్ణమాచార్యులు స్వామివారి మూల విరాట్టు, ఉత్సవమూర్తులను కన్నుల పండువగా అలంకరించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కార్య నిర్వహణాధికారి గుంటక శివనాగిరెడ్డి అన్ని ఏర్పాట్లు చేశారు. భగవాన్ సత్యసాయి సేవా సమితి భవనంలో పి ఆంజనేయ కుమార్ బ్రహ్మత్వంలో కళ్యాణ కార్యక్రమం జరిగింది. అలాగే పాతరామన్నపేట పురాణం వారి వీధిలోని రామాలయం, 39వ వార్డులోని రామాలయం, జగన్నాధపురంలోని కోదండ రామాలయం, రాజాగారి సెంటరులోని రామాలయం, బందరుకోటలో నూతనంగా నిర్మించిన రామాలయం, జవ్వారుపేట విజయ సీతారామాంజనేయ మందిరం, కోనేరుసెంటరులో ఏర్పాటు చేసిన పండ్ల వర్తక సంఘం, బంగారు వ్యాపారుల సంఘం, పచారీ వర్తక సంఘం తదితర సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలువ పందిళ్ళల్లో సీతారాముల కళ్యాణ మహోత్సవాలు సాంప్రదాయబద్ధంగా జరిగాయి. పురపాలక సంఘ కార్యాలయంలో కుల మతాలకు అతీతంగా శ్రీరామ నవమి వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, కాసాని భాగ్యారావు, బత్తిన దాస్, ముంతా రవీంద్ర, సనకా నాగులు, షేక్ అసీన్, షేక్ అమీర్, బత్తుల రమేష్, దింటకుర్తి సుధాకర్, సాతులూరి నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు. మండల పరిధిలోని కానూరు గ్రామంలో మార్కెట్ యార్డు చైర్మన్ గోపు సత్యనారాయణ-వెంకటేశ్వరమ్మ దంపతులు స్వామివారి కళ్యాణం నిర్వహించారు. అలాగే నెలితిప్ప గ్రామంలో ఇటీవల నిర్మించిన రామాలయంలో ప్రముఖ న్యాయవాది సోడిశెట్టి బాలాజీ దంపతులు స్వామివారి కళ్యాణం జరిపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.