కృష్ణ

తీర్చుకోలేనిది జన్మభూమి రుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామర్రు, జనవరి 26: జన్మనిచ్చిన తల్లికి, జన్మించిన గ్రామానికి ప్రతి వ్యక్తి తన పరిధిలో ఎంత సేవ చేసినా రుణం తీర్చుకోలేరని భారత సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ పేర్కొన్నారు. దివంగత ఎన్టీఆర్ జన్మభూమి అయిన పామర్రు మండలం నిమ్మకూరులో గురువారం నందమూరి హరికృష్ణ మేనల్లుడు ఆ గ్రామానికి చెందిన డాక్టర్ కుదరవల్లి సుబ్రహ్మణ్య సోమశేఖర్ ఏర్పాటు చేసిన సేవ్ ది లివర్ ఫౌండేషన్ అనే వైద్య సేవ సంస్థను ప్రారంభించి అదే వేదికపై రాజ్యసభ మాజీ సభ్యుడు నందమూరి హరికృష్ణకు గ్రామస్తులు ఏర్పాటు చేసిన పౌర సన్మాన సభలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. మూడు తరాలుగా తనకు నిమ్మకూరుతో అనుబంధం ఉందని సమీప గ్రామమైన పెదముత్తేవి తన స్వగ్రామం కావటంతో నిమ్మకూరు విశిష్టత ఇక్కడ కుదరవల్లి, నందమూరి కుటుంబాల సేవల పట్ల అవగాహన ఉందన్నారు. నిమ్మకూరు, అవిరిపూడి, నిబానపూడి గ్రామాలతోపాటు పెదముత్తేవి గ్రామానికి ఎంపి లాడ్స్ ద్వారా నందమూరి హరికృష్ణ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. సభలో పాల్గొన్న రాజ్యసభ మాజీ సభ్యుడు, కేంద్ర హిందీ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ తెలుగుజాతి కీర్తి పతాకాన్ని ప్రపంచంలో ఎగురవేసిన అన్న ఎన్టీఆర్ జన్మభూమిలో అదే బాటలో నడిచే వారి కుమారుడు హరికృష్ణను గ్రామస్థులు సన్మానించడం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. నమ్మిన వానికి ప్రాణం ఇచ్చే నైజం కలిగిన హరికృష్ణ ప్రజాసేవలో మరింత పండాలన్నారు. ఇదే సభలో పాల్గొన్న ప్రముఖ సీనియర్ నటుడు నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ నందమూరి తారక రామారావు జన్మించిన నిమ్మకూరుకు నా తండ్రి హరికృష్ణకు జన్మనిచ్చిన నిమ్మకూరుకు సలామ్ అంటూ సభా వేదికపై మొకరిల్లి పాదాభివందనం చేశారు. పల్లె ప్రాంతాల వాతావరణం కట్టుబాటులను నా కుటుంబ వారసులకు అలవాటు చేస్తానని, ఖాళీ సమయంలో నిమ్మకూరుకు విచ్చేసి సేవలందిస్తారన్నారు. డాక్టర్ సోమశేఖర్ ఏర్పాటు చేసిన కాలేయ రోగాల నివారణ వైద్య సేవా సంస్థను కళ్యాణరామ్ ప్రసంసించారు. పౌర సన్మానాన్ని స్వీకరించిన నందమూరి హరికృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ లాంటి కారణజన్ముడు, యుగపురుషుడు ఇక పుట్టరు, పుట్టలేరన్నారు. నిమ్మకూరు కళాశాలలో తన నిధులతో నిర్మించిన రెండు భవనాలను ఆయన ప్రారంభించి మాట్లాడుతూ విద్యార్థులు విద్యనభ్యసించాలని ఆధునిక విజ్ఞానం పట్ల మక్కువ చూపుతూ గ్రామీణ కట్టుబాటులను విస్మరించరాదని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ఎన్ సీతాపతి సన్మాన పత్రాన్ని అందించారు. డాక్టర్ కదరవల్లి సోమశేఖర్ మాట్లాడుతూ తన సేవా సంస్థ ద్వారా నిరంతరం ఉచిత వైద్యసేవలు అందిస్తానని ప్రకటించారు. సభా ప్రాంగణానికి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని విచ్చేసి హరికృష్ణను అభినందించి వెళ్లారు. వేలాది మంది జనం నిమ్మకూరుకు విచ్చేయటంతో పామర్రు, మచిలీపట్నం జాతీయ రహదారిపై కొద్ది ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.

దేశభక్తిని చాటిన సాంస్కృతిక ప్రదర్శనలు
మచిలీపట్నం (కల్చరల్), జనవరి 26: భారత దేశ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన విద్యార్థినీ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు దేశభక్తిని చాటి చెప్పాయి. జిల్లాలోని పలు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు పలు దేశభక్తి గీతాలకు చేసిన నృత్య ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. తొలుత చల్లపల్లి సిపిఎస్ స్కూల్ విద్యార్థులు నమో నమో ఆంధ్రప్రదేశ్ అంటూ చేసిన నృత్య ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. బాల వీరులారా లెండి లెండిరా.. అంటూ నిర్మలా హైస్కూల్ విద్యార్థులు, వందేమాతరం అంటుంది మా తరం.. అంటూ పెడనకు చెందిన సెయింట్ విన్సంట్ పల్లోటి స్కూల్ విద్యార్థులు, మన దేశం - భారత దేశం.. అంటూ రాజుపేటకు చెందిన లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ విద్యార్థులు, తెలుగు భాష తియ్యదనం తెలియజేసే విధంగా అవనిగడ్డకు చెందిన ఎన్‌ఆర్‌ఐ ఇండియన్ స్ప్రింగ్స్ స్కూల్ విద్యార్థులు, జయహో.. అంటూ జవ్వారుపేట శ్రీరామకృష్ణ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు, నీతి ఒకటే.. జాతి ఒకటే.. అంటూ శ్రీ బాలాజీ విద్యాలయం విద్యార్థులు, దేశ్ రంగీలా.. అంటూ సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు, తరంపంపం.. అంటూ మచిలీపట్నం పోలీస్ లైన్ ఆర్‌సిఎం స్కూల్ విద్యార్థులు, వందేమాతరం.. అంటూ భాస్కరపురం జవహర్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు అత్యద్భుత ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకుల కరతాళ ధ్వనులు అందుకున్నారు. సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చిన విద్యార్థినీ విద్యార్థులను జిల్లా రెవెన్యూ అధికారి చెరుకూరి రంగయ్య, ఆర్డీవో సాయిబాబు తదితరులు అభినందించి ప్రశంసా పత్రాలు అందుకున్నారు.