కృష్ణ

ఏ విచారణకైనా సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు, ఏప్రిల్ 15: తాను చెరువుమాధవరం సొసైటీలో సొమ్మును చెల్లించానని, ఇది ముమ్మాటికీ నిజమని, దీన్ని నిరూపించడానికి ఏ విచారణకైనా సిద్ధమేనని రైతు చెన్నంశెట్టి శేఖర్‌బాబు స్పష్టం చేశారు. ఆయన చెరువుమాధవరంలో శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతూ తాను రూ.10 లక్షలు సొమ్ము చెల్లించిన తర్వాతనే, సొసైటీ సెక్రటరీ మైలవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి, తాము చెల్లించిన రుణాలకు సంబంధించిన తనఖా బాండ్లను రద్దు చేశారన్నారు. దీనికి సంబంధించి సొసైటీ లెటర్ ప్యాడ్‌పై నోడ్యూస్ సర్ట్ఫికెట్ ఇచ్చారన్నారు. ఇందులో ఎటువంటి ఫోర్జరీ లేదన్నారు. కానీ తర్వాత మళ్ళీ తనఖాను పునరుద్ధరించాడన్నారు. తనకు జరిగిన అన్యాయంపై హైకోర్టును ఆశ్రయించి జప్తుపై స్టే తీసుకొచ్చామన్నారు. ఆపై జి.కొండూరు పిఎస్‌లో ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారన్నారు. విచారణలో వాస్తవాలు తెలుస్తాయన్నారు.