కృష్ణ

త్వరలో ఓడరేవు పనులు ప్రారంభం: కలెక్టర్ బాబు.ఎ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఏప్రిల్ 11: త్వరలోనే బందరు ఓడరేవు నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ (ముడ) కార్యాలయాన్ని మంగళవారం సందర్శించిన కలెక్టర్ బాబు.ఎ ముడ వైస్ చైర్మన్ వేణుగోపాలరెడ్డితో కలిసి భూసమీకరణ ప్రక్రియపై సమీక్షించారు. భూసమీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఓడరేవు నిర్మాణానికి అవసరమైన 5వేల 400 ఎకరాల్లో ఇప్పటికే 3వేల 14 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములను కాకినాడ పోర్టు డైరెక్టర్‌కు అప్పగించినట్లు తెలిపారు. 2వేల 300 ఎకరాలకు సంబంధించి రైతుల నుండి అంగీకార పత్రాలు వచ్చాయన్నారు. పోర్టు రోడ్డు, రైలు మార్గం ఏర్పాటుకు 200 ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు. ఈ భూమిని కూడా భూసమీకరణ ద్వారా సేకరిస్తామన్నారు. లేని పక్షంలో భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో సాయిబాబు కూడా పాల్గొన్నారు.

ఓటమికి కారణాలను గుర్తించి సరిచేసుకుంటాం: ఎమ్మెల్యే కొడాలి
గుడివాడ, ఏప్రిల్ 11: గెలుపు, ఓటమిలు సహజమని, 19వ వార్డు ఉప ఎన్నికలో ఓటమికి గల కారణాలను గుర్తించి లోటుపాట్లను సరిచేసుకుంటామని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చెప్పారు. మంగళవారం స్థానిక శరత్ థియేటర్లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 19వ వార్డులో విజయం సాధించిన టిడిపి అభ్యర్థి నండూరి వీరవెంకట ప్రసాద్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తలు నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు. వైసిపి జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మండలి హనుమంతరావు మాట్లాడుతూ అధికార పార్టీ ఓటర్లను ప్రలోభ పెట్టి, బెదిరించి, భయపెట్టి, పెద్ద మొత్తంలో డబ్బులు పంచడం వల్ల 149 ఓట్లతో బయటపడిందన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ అడపా బాబ్జి, కౌన్సిలర్ గొర్ల శ్రీను, కోఆప్షన్ సభ్యుడు సర్దార్‌బేగ్, నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, పాలేటి చంటి, పాలడుగు రాంప్రసాద్, ఎంవి నారాయణరెడ్డి, పెయ్యల ఆదాం, అల్లం రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.