కృష్ణ

మరమ్మతులకు నోచుకోని బార్లపూడి ఛానల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, ఏప్రిల్ 30: రెండు వేల యాభై ఎకరాల విస్తీర్ణం కలిగిన బార్లపూడి ఛానల్ పూడికతీసి గతంలో ఉన్న పైపులను తొలగించి పెద్ద సైజు పైపులను వేసి వేలాది మంది రైతుల సాగునీటి సమస్యను పరిష్కరించాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మొవ్వ మండల పరిధిలోని 150 బార్లపూడి ఛానల్ కృష్ణా డెల్టాలోని మేడూరు ఛానల్ పరిధిలో సబ్ కాలువగా కృష్ణాపురంలో ప్రారంభమైంది. ఇక్కడ నుంచి పమిడిముక్కల మండలం పెనుమచ్చ, మొవ్వ మండలం నర్సంపాలెం, మొవ్వ, మొవ్వపాలెం, వేములమడ, ఘంటసాల మండలం వి రుద్రవరం మీదుగా గుండేరు డ్రెయిన్‌లో కలుస్తోంది. దాదాపుగా రెండు దశాబ్దాల నుండి పూడికతీత పనులు చేపట్టకపోవటం, పెనుమచ్చ వద్ద ఏర్పాటు చేసిన 3*2 సైజు పైపులు చిన్నవి కావటంతో కృష్ణా జలాలు అన్ని ప్రాంతాలకు విడుదలైనా ఈ ప్రాంతంలోని బార్లపూడి ఆయకట్టు రైతులకు మాత్రం ఆగస్టు నెల వరకు భారీ వర్షాలు కురిస్తే తప్ప మిగిలిన సమయంలో సాగునీరులేక వెలవెలబోతోంది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈ సమస్యను పరిష్కరించాలంటూ మొవ్వ మండల రైతులు ఆదివారం విజ్ఞప్తి చేశారు. సాగునీటి సంఘం అధ్యక్షుడు తాతినేని చిన పూర్ణచంద్రరావు, మాజీ ఎంపిటిసి మండవ బాలాత్రిపుర సుందరి, మండవ బుచ్చికోటేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, తాతినేని పిచ్చేశ్వరరావు, మండవ పిచ్చేశ్వరరావు తదితరులు విజ్ఞప్తి చేశారు.

ఉపాధి పనుల్లో జిల్లాలోనే
నాగాయలంక మండలం ఫస్ట్
నాగాయలంక, ఏప్రిల్ 30: మండలంలో ఉపాధి పనులు ద్వారా కూలీలకు జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయి. వ్యవసాయ పనుల్లేని సమయంలో రోజూ వేలాది మందికి ఉపాధి పనులు కల్పిస్తూ నాగాయలంక మండలం జిల్లాలోనే అగ్రగామిగా నిలిచింది. మండలంలోని 22 పంచాయతీలలో ఉపాధి హామీ పనులు ప్రారంభంలోనే ఊపందుకున్నాయి. రోజుకు 5వేల మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.6కోట్ల 11 లక్షలతో శ్రామిక బడ్జెట్‌కు ఆమోదం లభించింది. ఈ సంవత్సరంలో ఈ పథకం కింద వ్యవసాయ కూలీలకు 2.18 లక్షల పని దినాలు కల్పించనున్నారు. గతంలో పంట బోదెలు, మైనర్ డ్రెయిన్‌లు, గుర్రపుడెక్క పనులను మాత్రమే కూలీలు చేసేవారు. ఈ ఏడాది నీటి కుంటలను తవ్వించేందుకు రైతులు ఆసక్తి చూపటంతో ఉపాధి పనులు గ్రామగ్రామాన జోరుగా సాగుతున్నాయి. పర్రచివర, చోడవరం, నంగేగడ్డ, నాచుగుంట, ఈలచెట్లదిబ్బ, తలగడదీవి గ్రామాలలో రైతులు నీటి కుంటలు తవ్వటంతో రోజుకు 5వేల మందికి పైగా కూలీలకు ఉపాధి కల్పించటంతో ఈ మండలం జిల్లాలోనే మొట్టమొదటి స్థానాన్ని దక్కించుకుంది. జాతీయ మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఎపిఓ తాతా ముత్యాలు మాట్లాడుతూ మండలంలో పంట కుంటలు తవ్వేందుకు రైతులు అత్యంత ఆసక్తి చూపుతున్నారన్నారు. దీంతో కూలీలకు పని కల్పించటం జరుగుతుందన్నారు. జల సంరక్షణ కార్యక్రమం కింద ఉద్యమంలా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మండలంలో ఉపాధి హామీ పథకం కింద ప్రతి వ్యవసాయ కూలీకి నూరుశాతం ఉపాధి కల్పించేందుకు అవసరమైన పనులను త్వరలోనే రూపొందించి అమలు చేయనున్నట్లు ముత్యాలు వివరించారు.