కృష్ణ

వేదాద్రి క్షేత్రంలో అంగరంగ వైభవంగా లక్ష్మీనారసింహుడి కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట రూరల్, మే 10: మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేదాద్రి శ్రీ్భనీలా సమేత శ్రీయోగానంద లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవం అశేష భక్త సందోహం మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. మంగళవారం అర్థరాత్రి 11గంటలకు స్వామి, అమ్మవారి ఎదురుకోల ఉత్సవం అనంతరం స్వామివారి కల్యాణాన్ని వేద పండితులు, ఆలయ అర్చకులు కమనీయంగా జరిపారు. కృష్ణానది నుండి వీచే గాలులు, నిండు పున్నమి వెలుగులతో పాటు ప్రత్యేకంగా అలంకరించిన విద్యుత్ దీపాలతో ఆలయ ప్రాంగణం ధగధగలాడింది. తొలుత స్వామివారి అమ్మవారి ఉత్సవ మూర్తులను అందంగా అలంకరించిన మండపం పైకి మేళతాళాలు, మంత్రోచ్ఛరణల మధ్య ఊరేగింపుగా అర్చక స్వాములు చేర్చారు. 12 గంటలకు మొదలైన కల్యాణం తెల్లవారుఝాము వరకూ కొనసాగింది. వంశపారంపర్య ధర్మకర్తల తరపున కెసిపి అధ్యక్షుడు జివికె ప్రసాద్, శంకరన్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి పీటలపై కూర్చున్నారు. సంప్రదాయం ప్రకారం ఆలయ పురోహితుల ధర్మపత్నులు తలంబ్రాలను స్వామివారికి సమర్పించారు. దేవాదాయ శాఖ తరపున కార్యనిర్వహణ అధికారి డి శ్రీరాం వరప్రసాదరావు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించి పీటలపై కూర్చున్నారు. ఆలయ ప్రాంగణం మొత్తం వేలాదిగా తరలివచ్చిన భక్తులతో నిండిపోయింది. దూర ప్రాంతాల నుండి భారీగా తరవచ్చిన భక్తులు కల్యాణ వేడుకలను తిలకించి క్షేత్రంలో నిద్రచేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చక్క భజన, కోలాట ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జగ్గయ్యపేట సిఐ లచ్చునాయుడు, చిల్లకల్లు ఎస్‌ఐ వంశీకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది భారీ బందోబస్తు నిర్వహించారు.