కృష్ణ

హోంగార్డులు ఆరోగ్యాన్ని సైతం కాపాడుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), అక్టోబర్ 12: హోంగార్డులు విధి నిర్వహణతో పాటు తమ ఆరోగ్యాన్ని కూడా సంరక్షించుకోవాలని జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సూచించారు. పోలీసు వ్యవస్థలో హోంగార్డులు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. గత సెప్టెంబర్ 4వతేదీన అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డు కె సాంబశివరావు కుటుంబ సభ్యులను గురువారం ఆయన పరామర్శించి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. శాఖాపరంగా సాంబ శివరావు కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. జిల్లాలోని హోంగార్డులు తమ నెలసరి వేతనంలో ఒక రోజు వేతనం రూపంలో అందచేసిన రూ.2లక్షల 20వేలు నగదును ఎస్పీ త్రిపాఠి మృతుని భార్య కె సుధారాణికి అందజేశారు. ఈ కార్యక్రమానికి ఆర్‌ఐ జె నాగిరెడ్డి, హోంగార్డుల ఆర్‌ఎస్‌ఐ సతీష్ కుమార్ పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరికీ పక్కా గృహం నిర్మిస్తాం - మంత్రి కొల్లు
మచిలీపట్నం (కోనేరుసెంటర్), అక్టోబర్ 12: ప్రతి ఒక్క పేదవాడికి సొంతిల్లు ఉండాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గృహాలను ప్రవేశ పెట్టారన్నారు. స్థానిక 29వ వార్డు సూరినగర్‌లో షేక్ ఫిరోజ్ నిర్మించుకున్న ఎన్టీఆర్ గృహాన్ని గురువారం మంత్రి రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణలో 1850 గృహాలు ప్రభుత్వం కేటాయించగా 1200 మంది ఎన్టీఆర్ గృహాలు నిర్మించుకుంటున్నారని, మరో 900 గృహాల మంజూరుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పట్టణంలో ఇళ్ల స్థలాలు లేని వారికి జీప్లస్ 3 విధానంలో 6,400 గృహాలు నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, గొర్రెపాటి గోపిచంద్, సయ్యద్ ఖాజా, అచ్చాబా, అజీమ్ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి - మంత్రి కొల్లు రవీంద్ర
బందరు అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక 22వ వార్డు చింతచెట్టు సెంటరు ఇబ్రహీం వీధిలో రూ.3.29లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్డు, డ్రెయిన్ నిర్మాణానికి మంత్రి రవీంద్ర గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా కోట్లాది రూపాయలు వెచ్చించి పట్టణంలో సిసి రోడ్లు, డ్రైన్‌లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ బాబా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.