కృష్ణ

పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, అక్టోబర్ 16: కాంట్రీబ్యూటరీ పెన్షన్ పథకాన్ని రద్దు చేస్తూ శాసనసభలో తీర్మానించి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయటం ద్వారా ఉపాధ్యాయులు, ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరుతూ యుటిఎఫ్ ఆధ్వర్యంలో అవనిగడ్డ తాలూకా కార్యాలయం ఎదుట సోమవారం ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి కనకారావు ఆధ్వర్యంలో ఈ ధర్నా జరుగ్గా పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సిపిఎస్ విధానాన్ని నిరసిస్తూ భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. పెన్షన్ అనేది ఉద్యోగుల హక్కు, యజమాని తన ఇష్టప్రకారం ఇచ్చే దయాధర్మం కాదని వారు స్పస్టం చేశారు. అలాగే ఈ ధర్నా కార్యక్రమంలో జనసేన నేత రాయపూడి వేణుగోపాలరావు పాల్గొని మద్దతు ప్రకటించారు. జనసేన నేత పవన్ కల్యాణ్ చెప్పేది కూడా ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరుతున్నారని ఆయన పేర్కొన్నారు.

అర్ధరాత్రి భారీ వర్షం
మచిలీపట్నం (కోనేరుసెంటర్), అక్టోబర్ 16: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా ఆదివారం అర్ధరాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి బందరు పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాలు జలమయమయ్యాయి. విద్యుత్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. విద్యుత్ స్తంబాలు ఒరిగిపోగా, కొన్ని చోట్ల చెట్లు విరిగిపోయాయి. సుమారు రెండు గంటల పాటు ఉరుములతో కూడిన వర్షం పడటంతో ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు భయబ్రాంతులకు గురయ్యారు. విద్యుత్ లేకపోవటంతో చిన్నారులు దోమలకు అల్లల్లాడారు. పల్లపు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు వర్షం నీటితో నిండిపోవటంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. అలాగే మండల పరిధిలో సాగు చేసిన వరి పొలాలు ఏపుగా పెరగటంతో అక్కడక్కడా పడిపోయాయి.