కృష్ణ

తగిన నష్టపరిహారం చెల్లించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాట్రాయి, నవంబర్ 21: తగిన నష్టపరిహారం చెల్లించిన తరువాతే చింతలపూడి పేజ్-2 ప్రాజెక్టులోని భూముల్ని రైతుల నుండి తీసుకోవాలని ఎపి రైతు సంఘం మండల అధ్యక్షుడు చాగంటి రాజారావు అన్నారు. మంగళవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌంట్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ చింతలపూడి ఎత్తిపోతల పథకం వచ్చినందుకు సంతోషించాలో, భూములు కోల్పోతున్నందుకు బాధపడాలో రైతులు ఆందోళన చెందుతున్నారని, ప్రభుత్వం ఇప్పటికి ఎన్నో సమావేశాలు నిర్వహించిందని, నష్టపరిహారం ఎంతో తేల్చలేదని అన్నారు. నష్టపరిహారం ప్రకటించిన తరువాతే కాలువ తవ్వకం పనులు చేపట్టాలని, ఒకేసారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు వేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎపి వ్యవసాయకూలీ సంఘం మండల కార్యదర్శి కొమ్ము ఆనంద్, కెవిపిఎస్ మండల కార్యదర్శి భాస్కర్, కౌలురైతు సంఘం మండల అధ్యక్షుడు జగన్, యువజన సంఘం అధ్యక్షులు ధనుష్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో ఊపందుకున్న ఖరీఫ్ పనులు
* ముమ్మరంగా పనులతో కూలీల్లో ఆనందం
మచిలీపట్నం (కోనేరుసెంటర్), నవంబర్ 21: జిల్లాలో ఖరీఫ్ పనులు ఊపందుకోవటంతో రెక్కాడితేకాని డొక్కాడని కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న కూలీలకు పనులు దొరకటంతో చేసిన అప్పులు తీర్చుకుంటూ తమ కుటుంబాన్ని పోషించుకునేందుకు పనుల్లో బిజీ అయ్యారు. మహిళా కూలీలు సైతం పనులకు క్యూ కడుతున్నారు. ఎకరా వరి కోతలు కోసేందుకు కూలీలు రూ.2200 నుండి రూ.3వేల వరకు డిమాండ్ చేస్తున్నారు. చాపచుట్టగా పడిపోయిన వరి పొలాలకు అదనంగా అడుగుతున్నారు. అలాగే మినుము విత్తనాలు చల్లటం, వరి పాయలు తీయటం, కట్టివేతలు తదితర పనుల్లో కూలీలు బిజీబిజీ అయ్యారు. ఎకరా వరి పంటను కట్టివేతలు కట్టేందుకు రూ.1600లు తీసుకుంటున్నారు. అలాగే మగ కూలీకి రోజుకు రూ.350లు ఇస్తున్నారు. వాతావరణం సక్రమంగా ఉంటే కూలిరేట్లు పెరగవు, అదే వాతావరణంలో మార్పులు చేసుకుంటే కూలిరేట్లు ఆకాశాన్నంటే ప్రమాదం ఉందని రైతులు పేర్కొంటున్నారు. కూలీలు మాత్రం ఈ ఏడాది ఖరీఫ్ వరిపంట గతంలో ఎన్నడూ లేని విధంగా ఉందని, కూలి రేటు పెంచాల్సిందేనని పేర్కొంటున్నారు. ఏది ఎమైనా కూలీలకు చేతి నిండా పని దొరకటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారనడంలో సందేహం లేదు.