కృష్ణ

ఈ పోస్ విధానాన్ని పరిశీలించిన కేంద్ర బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, డిసెంబర్ 5: రాష్ట్రంలో రేషన్ దుకాణాలలో అమలవుతున్న ఈపోస్ విధానాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం మంగళవారం మైలవరం విచ్చేసింది. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఎంఎల్‌ఎస్ పాయింట్‌ను సందర్శించి ఈపోస్ పనితీరును పరిశీలించింది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్ అధికారులు ఈబృందంలో ఉన్నారు. దాదాపు 15 మందితో కూడిన ఈబృందం ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో ఈపోస్ విధానం పనితీరును ఒక్కొక్కటిగా, క్షుణ్ణంగా పరిశీలించారు. బియ్యం ఎక్కడి నుండి ఎలా ఈపాయింట్‌కు వస్తాయి, ఇక్కడి నుండి డీలర్లకు ఎలా డెలివరీ అవుతాయి, డీలర్లు ప్రభుత్వానికి సొమ్ము చెల్లించే విధానం తెలుసుకున్నారు. ఇక్కడి నుండి రేషన్ షాపునకు వెళ్ళి అక్కడ వినియోగదారునికి రేషన్ ఇచ్చే విధానం, వినియోగదారుడు వేలి ముద్రల ద్వారా రేషన్ తీసుకునే విధానం, వేలి ముద్రలు పడని వినియోగదారులు ఏ విధంగా రేషన్ తీసుకునేది తెలుసుకున్నారు. నగదుతో కూడిన లావాదేవీలు, నగదు రహిత లావాదేవీల విషయాలను కూడా తెలుసుకున్నారు. ఈపోస్ విధానం లేని సమయంలో ప్రజాపంపిణీ విధానంలో జరిగిన అవకతవకలు, ఈవిధానం అమలులోకి వచ్చిన తర్వాత దుర్వినియోగాన్ని అరికట్టిన తీరును తెలుసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈపోస్ విధానం చాలా అద్భుతంగా ఉందని కితాబునిచ్చారు. ఈవిధానం వల్ల ఆంధ్రరాష్ట్రం మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో స్థానిక తహశీల్దార్ కెవి శివయ్య, డీఎస్‌ఓ, సివిల్ సప్లై సిబ్బంది పాల్గొన్నారు.

ఉయ్యూరుకు కృష్ణా నీళ్లు

* రూ. 47కోట్లతో ప్రణాళికలు
ఉయ్యూరు. డిసెంబర్ 5: ఉయ్యూ రు పట్టణ తాగునీటి అవసరాలు తీర్చేందుకు కృష్ణానదీ జలాలు తీసుకువచ్చేందుకు రు.47 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మున్సిపల్ చైర్మన్ జంపాన పూర్ణచంద్రరావు తెలిపారు. మంగళవారం నగరపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ తో ట్లవల్లూరు నుండి పైపు లైన్ ద్వారా పట్టణ తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఈ సమగ్ర మంచినీటి సరఫరా పథకం ఉపయోగపడుతుందని చెప్పా రు. కమిషనర్ శేఖరరావు మాట్లాడు తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రత్యేక నిధులకు, సాధారణ నిధులు జోడించి ప్రణాళిక సిద్ధం చేశామని, ప్రభుత్వ అనుమతి పొందితే వచ్చే వేసవి నాటికే ఈ పథకం అమలవుతుందన్నారు. జనాభా పెరుగుదల వల్ల పట్టణంలో పలు ప్రాంతాలలో తా గునీటి ఎద్దడి నెలకొంటోందని చెప్పా రు. ఈ సమస్యను అధిగమించేందుకు ఈ పథకం ఉపకరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్‌లు, అధికారులు పాల్గొన్నారు.