కృష్ణ

బందరు తీరం దిశగా...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, డిసెంబర్ 7: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తర కోస్తా దిశగా బందరు తీరం వైపు వడివడిగా దూసుకువస్తోంది. రానున్న 48 గంటల్లో వాయుగుండం తీవ్ర తుపాన్‌గా మారి కాకినాడ-మచిలీపట్నం మధ్య తీరం దాటే ప్రమాదం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు డెల్టా రైతుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. దీని కారణంగా గురు, శుక్రవారాల్లో కోస్తాలో తీవ్ర వర్షాలు కురిసే ప్రమాదం ఉండటంతో ఆగమేఘాల మీద రైతులు పండించిన పంటను కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారు. మరో పక్క భారీ వర్షాల నుండి ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం కలుగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలను జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం నేతృత్వంలో జిల్లా యంత్రాంగం చేపట్టింది. ఇప్పటికే బందరు ఓడరేవులో ఒకవ నెంబరు ప్రమాద హెచ్చరికను ఎగుర వేశారు. సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి రావల్సిందిగా సంకేతాలు అందజేశారు. తుపాన్ ముప్పు తప్పే వరకు మత్స్యకారులెవ్వరూ సముద్రంలోకి వేటకు వెళ్లదని ఆదేశాలు జారీ చేశారు. గత నాలుగైదు రోజులుగా వాయుగుండం ప్రభావంతో రైతులు పంట రక్షణ చర్యల్లో బిజీ అయ్యారు. డెల్టాలో ప్రస్తుతం ఖరీఫ్ వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. పట్టిసీమ నీళ్లు ఈ ఏడాది పుష్కలంగా రావటంతో దిగుబడులు కూడా అదే విధంగా వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వచ్చిన దిగుబడులను చూసి మురిసి పోతున్న రైతులకు వాయుగుండం కలవరపాటుకు గురి చేసింది. వరి కోతలను ముమ్మరం చేశారు. కూలీలతో కాకుండా యంత్ర పరికరాలను ఉపయోగించి మరీ వరి కోతలను పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే కోసి పనల మీద ఉన్న పంటను కుప్పలు వేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో నూర్పిళ్లు చేసి దిగుబడులను కల్లాల మీదనే మిల్లర్లకు అమ్మకాలు చేస్తున్నారు. సమృద్ధిగా విడుదలైన పట్టిసీమ నీటి కారణంగా జిల్లాలో ఈ ఏడాది సుమారు 50వేల ఎకరాల్లో అదనంగా పంట సాగైంది. 2.37లక్షల హెక్టార్లలో సాగు చేపట్టగా 70 శాతం కోతలు పూర్తయ్యాయి. దిగుబడులు ఆశాజనకంగా ఉండటంతో ప్రభుత్వం కూడా ముందస్తుగానే ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిచింది. జిల్లాలో మొత్తం 330 కేంద్రాలను ఏర్పాటు చేయగా 151 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. 8.63లక్షల టన్నుల ధాన్యం సేకరణ కాగా ఇప్పటి వరకు 60 టన్నులు పైబడి కొనుగోళ్లు చేశారు. ఈ నేపథ్యంలో తుపాన్ హెచ్చరికలు రైతులను ఆందోళనలో పడేశాయి. భారీ వర్షాల నుండి రైతు పండించిన పంటను కాపాడేందుకు జిల్లా యంత్రాంగం కూడా సర్వం సిద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాలు, గ్రామైఖ్య సంఘాల ద్వారా టార్ఫాలిన్‌లను కొనుగోలు చేశారు. కల్లాల మీద ఉన్న పంటను తడవకుండా కొనుగోలు కేంద్రాలకు తరలించే విధంగా చర్యలు చేపట్టారు.

ఆక్వా రైతులు హైబ్రిడ్ చిల్లింగ్ ప్లాంట్‌ను సద్వినియోగం చేసుకోవాలి - మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం (కోనేరుసెంటర్), డిసెంబర్ 7: స్థానిక గిలకలదిండి ఫిషింగ్ హార్బర్ వద్ద రూ.15లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సోలార్ విండ్ హైబ్రిడ్ చిల్లింగ్ ప్లాంట్‌ను ఆక్వా రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. గురువారం ప్లాంట్‌ను ఎంపీ కొనకళ్ల నారాయణరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మత్స్య ఉత్పత్తులకు గిట్టుబాటు ధర వచ్చే వరకు తమ ఉత్పత్తులను పరిశుభ్రంగా మంచి నాణ్యతా ప్రమాణాలతో ఎండబెట్టి నిల్వ చేసుకోవడానికి ఈ ప్లాంట్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో బ్లూరివల్యూషన్ పథకం కింద 1.2టన్నుల సామర్థ్యం గల ఈ ప్లాంట్ సోలార్, విండ్ పవర్‌తో పనిచేస్తుందన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో సోలార్ విండ్ పవర్ పని చేయనప్పుడు 1.5కెవీఎ సామర్థ్యం గల జనరేటర్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్, ఎఎంసీ చైర్మన్ చిలంకుర్తి తాతయ్య, మత్స్య శాఖ ఎడీ రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.