కృష్ణ

రుణమాఫీలపై జాతీయ విధానం అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హనుమాన్ జం క్షన్, డిసెంబరు 10: ప్రభుత్వాలు అమ లు చేస్తున్న రుణ మాఫీలపై జాతీయ విధానం అవసరమని పార్లమెంట్ మాజీ సభ్యుడు, రైతాంగ నిపుణుడు యలమంచిలి శివా జీ అన్నారు. త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ రూపకల్పన సలహా కమిటీ సమావేశం ఇటీవల జరిగింది. ఈ సందర్భంగా ఆదివారం రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులు తుమ్మల అంజిబాబు నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ దేశంలోని రైతులకు ఒక్కసారి రుణమాఫీ చేయడం వల్ల రైతులకు ఎటువంటి ప్రయోజనం ఉండదని వాఖ్యానించారు. నాయకులు తీసుకున్న రైతు రుణ మాఫీ నిర్ణయాన్ని తప్పుపడుతున్న బ్యాంక్‌లు బడా పారిశ్రామిక వేత్తల రుణాలను ఎలా మాఫీ చేస్తున్నాయో సమావేశంలో ప్రస్తావించానని వివరించారు. లక్షల కోట్లు చెల్లించకుండా నిర్భయంగా తిరుగుతున్న పారిశ్రామికవేత్తలను వదలి బ్యాంక్ అధికారులు రైతుల్ని చెల్లించవలసిన చిన్నపాటి రుణాలకు ఒత్తిడి తీసుకురావడం సరికాదనే అంశాన్ని సమావేశం దృష్టికి తీసుకు వచ్చానన్నారు. విలేఖర్ల సమావేశంలో బాపులపాడు మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సూరపనేని వెంకటేశ్వరరావు, కార్యదర్శి తోట మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో జిల్లా ఫస్ట్
* కలెక్టర్ లక్ష్మీకాంతం

విజయవాడ, డిసెంబర్ 10: ప్రతి నెలా పంపిణీ చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్లలో జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉందని కలెక్టర్ బీ లక్ష్మీకాంతం తెలిపారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగ, కల్లు, గీత, చేనేత కార్మికులకు ప్రతి నెలా 5లోపుగా పింఛన్లను పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లాలో 3,54 లక్షల మంది పింఛన్‌దారులు ఉండగా వీరిలో 3.51 లక్షల మందికి పింఛన్ల పంపిణీ పూర్తితో 99.19 శాతంతో అగ్రస్థానంలో ఉందన్నారు. జిల్లా గ్రామీణా సంస్థ ద్వారా ప్రతి నెలా రూ. 37కోట్లను ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లాలో 3.40 లక్షల మందికి బిజినెస్ కరస్పాడెంట్ల ద్వారా, 15వేల మందికి ప్రభుత్వ అధికారుల ద్వారా పింఛన్ల పంపిణీను పూర్తి చేస్తున్నామని వివరించారు. జిల్లాలో రహదారులకు ఇరువైపుల పచ్చదనాన్ని పెంపొందించడంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టిందన్నారు. ఇప్పటి వరకు 1012 కి.మీ మొక్కలు నాటటం పూర్తి చేసి రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. ప్రతి కి.మీకు 400ల మొక్కలు చొప్పున రహదారులకు ఇరువైపుల నాటి వాటి సంరక్షణలో మొదటి స్థానంలో ఉన్నామన్నారు. ఉద్యానవనంలో భాగంగా 1000 ఎకరాల్లో మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా 1350 ఎకరాలు లక్ష్యాలను అధికమించి మొదటి స్థానంలో ఉన్నామని, ప్రతి ఎకరాకు 70 మొక్కలు చొప్పున నాటి అగ్రస్థానంలో ఉన్నామని కలెక్టర్ వివరించారు.