కృష్ణ

దేశంలో రెండే కులాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలిదిండి, జనవరి 2: దేశంలో రెండే కులాలని, ఒకటి పేద, రెండవది ధనిక కులం అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కొచ్చర్ల గ్రామంలో నిర్వహించిన జన్మభూమి గ్రామసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పట్టిసీమ లేకుంటే మంచినీరు కూడా అందేవి కాదన్నారు. అత్యధికంగా ఆక్వా సాగు ఉన్నందున కరెంట్ కొరత లేకుండా చేస్తామన్నారు. చేపలు, రొయ్యల చెరువుల రైతులకు తక్కువ ధరలో విద్యుత్ అంద చేస్తున్నట్లు తెలిపారు. బీసీలు పెండ్లి చేసుకుంటే రూ.35వేలు, ఎస్సీ, ఎస్టీలు పెండ్లి చేసుకుంటే రూ.50వేలు ప్రభుత్వం సహాయం అందిస్తుందన్నారు. ఈనెలాఖరులోగా ఇళ్ల స్థలాల సమస్యలను పరిష్కరించాలని తహశీల్దార్ వెనె్నల శ్రీనివాస్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ్య, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, ఎంపీపీ బండి లక్ష్మి, మండల ప్రత్యేక అధికారి అశోక్ కుమార్, జెడ్పీటీసీ నున్నా రమాదేవి, ఎఎంసీ చైర్మన్ వల్లభనేని శ్రీనివాస చౌదరి, మండల బీజేపీ అధ్యక్షుడు గుర్రాల శ్రీరామమూర్తి, మాజీ ఎఎంసీ చైర్మన్ తాడినాడ బాబు, కొచ్చెర్ల సర్పంచ్ మొవ్వ రమేష్, సొసైటీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి, నాయకులు చిట్టూరి రవీంద్ర, చన్నంశెట్టి కోదండ రామయ్య, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. అలాగే తాడినాడ, చినతాడినాడలో కూడా జన్మభూమి గ్రామసభలు నిర్వహించారు.