కృష్ణ

ధాన్యం కొనుగోళ్లల్లో... తొలగిన ప్రతిష్ఠంభన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జనవరి 17: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లల్లో నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యంతో జిల్లా అధికార యంత్రాంగం, మిల్లర్ల మధ్య కొన్ని రోజులుగా నెలకొన్న వివాదం సమసింది. అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ మిల్లర్లు, అక్రమాలకు పాల్పడుతున్నారంటూ అధికారులు ఒకరిపై ఒకరు పరస్పర విమర్శల కారణంగా జిల్లాలో వారం రోజులుగా ధాన్యం కొనుగోళ్లల్లో ప్రతిష్ఠంభన నెలకొంది. కొనుగోళ్లపై ఆంక్షలు విధించటంతో అధికార యంత్రాంగం తీరును నిరసిస్తూ రైస్ మిల్లర్లు సహాయ నిరాకరణకు దిగారు. ఈ నేపథ్యంలో రైతులు పండించిన దిగుబడులు కల్లాలకే పరిమితమయ్యాయి. ధాన్యం కొనుగోళ్లకు మిల్లర్లు ససేమిరా అనటంతో రైతులు మరింత ఇబ్బందులకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి సమస్యను వివరించారు. దీంతో స్పందించిన సీఎం చంద్రబాబు తక్షణమే ఆంక్షలు ఎత్తి వేసి ధాన్యం కొనుగోళ్లు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. దీంతో సమస్య ఒక కొలిక్కి వచ్చింది. సహాయ నిరాకరణలో ఉన్న మిల్లర్లు బుధవారం నుండి రైతుల నుండి ధాన్యం సేకరణ ప్రారంభించారు. అధికారులు కూడా పెండింగ్‌లో ఉన్న బిల్లులను కొంత మేర మంజూరు చేశారు. ధాన్యం కొనుగోళ్లల్లో ఎటువంటి ఇబ్బందులు లేవని, ఇకపై నిరంతరాయంగా కొనుగోళ్లు జరుగుతాయని అధికారులు చెబుతున్నారు.