కృష్ణ

పోలీసులంటే ప్రజలకు నమ్మకం కలగడం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, ఏప్రిల్ 29: అధికార పార్టీ నాయకుల అక్రమాలను కొంతమంది పోలీసులు ప్రోత్సహిస్తున్నారని, అందువల్లే పోలీసులంటే ప్రజలకు నమ్మకం కలగడం లేదని మాజీ మంత్రి కఠారి ఈశ్వర్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. నందివాడ పోలీస్‌స్టేషన్ పనితీరు సరిగాలేదని తాలూకా సీఐ దృష్టికి తీసుకువచ్చానని, ఎస్‌ఐపై గుడివాడ డిఎస్పీ, జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేస్తానని ఆయన చెప్పారు. శుక్రవారం స్థానిక బయ్యావారి వీధిలోని తన ఇంట్లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో కఠారి మాట్లాడారు. ఈ నెల 25వ తేదీన నందివాడకు చెందిన పెద్దిబోయిన ఫణీంద్రకుమార్, ఇప్పిలి నాగరాజులను అకారణంగా 9మంది వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేశారన్నారు. స్థానికంగా ఉన్న టిడిపి నాయకత్వం న్యాయం చేస్తారని భావించిన బాధితులు చివరకు న్యాయం జరగకపోవడంతో తన దగ్గరకు వచ్చారన్నారు. తీవ్రగాయాలతో ఉన్న బాధితులను 27వ తేదీన గుడివాడ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించానన్నారు. అయితే దాడి చేసిన వారి తరపున కొంతమంది వచ్చి రాజీ చేయాలని కోరారని, ఈ ఘటనలో బిసిలు, ఎస్సీలు ఉండడం వల్ల వారి ఐక్యత కోసం రాజీ కుదిర్చేందుకు సిద్ధపడ్డానన్నారు. అయితే దాడి చేసిన వారు కూడా ప్రభుత్వాసుపత్రిలో చేరి గొడవకు సంబంధం లేని వ్యక్తులపై కూడా కేసులు పెట్టారన్నారు. ఈ విషయాన్ని నందివాడ ఎస్‌ఐ రాంబాబు దృష్టికి తీసుకువెళ్ళి సక్రమంగా విచారణ జరపాలని కోరానన్నారు. ఇరువర్గాలనూ పిలిచి మాట్లాడతానని చెప్పిన ఎస్‌ఐ రాంబాబు బాధితులను మాత్రమే స్టేషన్‌కు పిలిపించడంతో తాను కూడా స్వయంగా స్టేషన్‌కు వెళ్ళానన్నారు. నేను ఎవరినైనా, ఎప్పుడైనా పిలుస్తానని, ఇష్టమొచ్చినట్టు ఎంక్వైరీ చేస్తానని, మీకు చెప్పాల్సిన అవసరం లేదని ఎస్‌ఐ మాట్లాడారని, తన 25ఏళ్ళ రాజకీయ జీవితంలో ఇటువంటి ఎస్‌ఐని ఎన్నడూ చూడలేదన్నారు. గుడివాడ ప్రభుత్వాసుపత్రి కూడా క్రిమినల్స్‌కు అడ్డాగా మారిందని, వాస్తవంగా దెబ్బలు తగిలిన వారితో పాటు తగలని వారిని కూడా చేర్చుకుని వైద్యం అందిస్తున్నారని విమర్శించారు. బిసిలు, ఎస్సీలు కలిసి ఉండాలనే లక్ష్యానికి విరుద్ధంగా వ్యవహరించే వారిని పోలీసులు ప్రోత్సహించడం సరికాదని కఠారి అన్నారు. ఈ సమావేశంలో వైసీపి నేత గంటా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.