కృష్ణ

నేటి నుండి ‘టెట్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ఇప్పటికే పలు సార్లు వాయిదా పడిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నేటి నుండి ప్రారంభం కానుంది. పది రోజుల పాటు నిర్వహించనున్న టెట్ పరీక్షలకు విద్యా శాఖాధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం పర్యవేక్షణలో విద్యా శాఖాధికారులు టెట్ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. జిల్లాలో 50వేల 184 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతుండగా వీరి కోసం 23 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇంజనీరింగ్ కళాశాలలు, కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్లను పరీక్షా కేంద్రాలుగా గుర్తించారు. ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక డిపార్ట్‌మెంట్ అధికారిని నియమించారు. అలాగే ప్రతి రెండు పరీక్షా కేంద్రాలకు ఒక జిల్లా స్థాయి అధికారిని పర్యవేక్షకుడిగా నియమించారు. జిల్లా రెవెన్యూ అధికారి బిఆర్ అంబేద్కర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తుండగా జిల్లా విద్యా శాఖాధికారిణి ఎంవి రాజ్యలక్ష్మి సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు. ప్రతి రోజూ ఉదయం 9.30ని.ల నుండి 12గంటల వరకు, మధ్యాహ్నం 2.30ని.ల నుండి 5గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అంధులు, వికలాంగులైన అభ్యర్థుల కోసం అదనంగా 50 నిమిషాలు సమయాన్ని కేటాయించారు. జిల్లాలో మొత్తం 100 మంది అంధ, వికలాంగ అభ్యర్థులు టెట్‌కు హాజరు కానున్నారు. హాల్ టికెట్‌పై ఫోటో లేని అభ్యర్థులను కూడా పరీక్షకు అనుమతించనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 50వేల 184 మంది పరీక్షలు రాయనున్నారు. పేపర్-1కు 18వేల 947 మంది, పేపర్-2 పరీక్షకు 23వేల 810 మంది, పేపర్-3 పరీక్షకు 812 మంది, పేపర్-4కు 202 మంది, పేపర్-5కు 6వేల 413 మంది పరీక్షకు హాజరు కానున్నారు.

కుల రాజకీయాలు వద్దు

చాట్రాయి: సమాజంలో అన్ని కులాలు కలసి, మెలసి జీవనం సాగించాలే తప్ప కుల పరంగా విడిపోవద్దని, అదేవిధంగా రాజకీయ నాయకులు సైతం కుల రాజకీయాలను ప్రోత్సహించవద్దని జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠి త్రిపాఠి సూచించారు. కుల రాజకీయాలు ప్రోత్సహించటం వల్ల గ్రామాల్లో అశాంతి నెలకొంటుందని చెప్పారు. స్థానిక పోలీసు స్టేషన్‌ను మంగళవారం సాయంత్రం ఆయన తనిఖీ చేశారు. చాట్రాయి పోలీసుల పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గ్రామాల్లో కోడి పందాలు, జూదాలకు ప్రజలు సహకరించవద్దని సూచించారు. ప్రతి పేదవానికి న్యాయ సహాయం అందేవిధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డిఎస్‌పి వి శ్రీనివాసరావు, సర్కిల్ ఇనస్పెక్టర్ సత్యనారాయణ, ఎస్‌ఐ కన్నప్పరాజు తదితరులు పాల్గొన్నారు.