కృష్ణ

ప్రశాంతంగా ముగిసిన ఎంసెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్), ఏప్రిల్ 29: పట్టణంలో శుక్రవారం నిర్వహించిన ఎంసెట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.
ఇంజనీరింగ్ విభాగంలో ఆరు పరీక్షా కేంద్రాల్లో 2,612 మంది, మెడిసిన్ విభాగంలో ఒక పరీక్షా కేంద్రంలో 672 మంది పరీక్ష వ్రాశారు. ఉదయం జరిగిన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలో 96.45 హాజరు శాతం నమోదు కాగా మెడిసిన్ ప్రవేశ పరీక్షలో 96.13శాతం హాజరయ్యారు. ఇంజనీరింగ్ విభాగంలో హిందూ కళాశాలలో 638 మందికి 622 మంది, డిఎంఎస్ అండ్ ఎస్‌విహెచ్ ఇంజనీరింగ్ కళాశాల ఎ కేంద్రంలో 400 మందికి 391, బి కేంద్రంలో 300 మందికి 288 మంది, సి కేంద్రంలో 300 మందికి 290 మంది, నోబుల్ కళాశాలలో 500 మందికి 476 మంది, వరలక్ష్మీ పాలిటెక్నిక్‌లో 570 మందికి 545 మంది పరీక్ష రాశారు.
పట్టణ కోఆర్డినేటర్, హిందూ కళాశాల ప్రిన్సిపాల్ వి ఉషారాణి, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ ఆర్ గురునాధ, ప్రత్యేక పరిశీలకులు వివి కృష్ణారావు, డా. కె నాగ ప్రకాష్ పరీక్షలను పర్యవేక్షించారు.