కృష్ణ

అంగన్‌వాడీలకు తెలంగాణాలో పెంచినట్లే ఇక్కడా వేతనాలు పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఐసీడీఎస్ బడ్జెట్, అంగన్‌వాడీల వేతనాల పెంపు, పెన్షన్‌తో కూడిన రిటైర్‌మెంట్ బెనిఫిట్, లబ్ధిదారులకు బయోమెట్రిక్ రద్దు, పెండింగ్ బకాయిలు తదితర సమస్యల పరిష్కారానికి చలో విజయవాడ పిలుపు మేరకు సోమవారం సీఐటీయూ అనుబంధ ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ నుండి వేలాది మందితో భారీ ప్రదర్శన అనంతరం అలంకార్ థియేటర్ దగ్గర ధర్నా చౌక్‌లో ధర్నా జరిగింది. ఈ ధర్నాను జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఉగాది పర్వదినం రోజే మహిళల్ని, వారి కుటుంబ సభ్యులను పోలీసుస్టేషన్‌లో నిర్బంధించారు. బయలు దేరిన వాళ్లను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. వేలాది మంది టిక్కెట్లు కొనుకున్న వాళ్లను కూడా బస్సులు, ట్రైన్ల నుండి దించేశారు. అయినప్పటికీ రాష్ట్ర నలుమూలల నుండి భారీ సంఖ్యలో తరలివచ్చారు. కార్యకర్తలతో చలో విజయవాడ విజయవంతమైంది. ఈ ధర్నాకు ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జీ బేబిరాణి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సుబ్బరావమ్మ మట్లాడుతూ అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లకు ఈ మూడున్నరేళ్ల కాలంలో పనిభారం విపరీతంగా పెరిగిందన్నారు. తెలంగాణాలో 2017 నుండి వర్కర్లకు రూ. 10,500, హెల్పర్, మినీ వర్కర్లకు రూ. 6వేలు ఇస్తున్నారన్నారు. కానీ మన రాష్ట్రంలో వేతనాల పెంపుపై ప్రభుత్వం నోరు మెదపడం లేదన్నారు. ఈ సమస్యను 3నెలల లోపు పరిష్కరించాలని లేని పక్షంలో ఉద్యమం మరింత ఎత్తున చేస్తామని హెచ్చరించారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా శిశు సంక్షేమ శాఖలో పని చేస్తున్న అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు, అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. అంగన్‌వాడీలపై రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీ రమాదేవి మాట్లాడుతూ అంగన్‌వాడీల జాబ్ చార్ట్‌లో లేని రకరకాల పనులు అప్పగిస్తున్నారు, దీని వల్ల ప్రీ స్కూల్ దెబ్బతింటుందన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పీ మధు మాట్లాడుతూ అంగన్‌వాడీలకు తెలంగాణాలో ఇచ్చిన విధంగా వేతనాలు పెంచాలని, పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి పార్థసారథి మాట్లాడుతూ అంగన్‌వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జేడీ శివపార్వతికి అందజేశారు. జేడీ మాట్లాడుతూ వేతన పెంపు, పెన్షన్‌తో కూడిన రిటైర్‌మెంట్ బెనిఫిట్, బయోమెట్రిక్ రద్దు తదితర డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. పెండింగ్ బకాయిలన్నీ మార్చి నెలాఖరులోకా విడుదల చేస్తామన్నారు. ధర్నా ఉద్దేశించి పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ అంగన్‌వాడీ సమస్యలను శాసనమండలిలో కొషన్ అవర్‌లో ప్రశ్న అడిగాం, ప్రభుత్వ అధికారులకు తెలియజేశాం, అంగన్‌వాడీలకు వేతనాలు పెరిగే వరకు పోరాటానికి పీడీఎఫ్ ఎమ్మెల్సీల మద్దతు ఉంటుందని తెలిపారు. జనసేన నాయకుడు పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ అంగన్‌వాడీల సమస్యలన్నీ పవన్‌కల్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేస్తామని తెలిపారు. ట్రేడ్ యూనియన్ నాయకులు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీ ఉమామహేశ్వరరావు, ఐఎఫ్‌టీయూ నాయకులు పొలారి, రమారావు, ఏపీ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ రాష్ట్ర కార్యదర్శి ఏవీ నాగేశ్వరరావు, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ కే ధనలక్ష్మీ, భవన నిర్మాణ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌వీ నర్శింహరావు, ట్రాన్స్‌పోర్టు యూనియన్ రాష్ట్ర నాయకుడు ముజఫర్ అహ్మద్, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ నాయకులు ఎన్‌సిహెచ్ సుప్రజ, ఎస్ వాణిశ్రీ, టీ భారతి తదితరులు నాయకత్వం వహించారు.