కృష్ణ

మోదీని ఎదిరించిన మొనగాడు జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టటం ద్వారా దేశ రాజకీయాలలో ఎవరూ చేయలేని పనిని వైసీపీ నేత జగన్ చేసి మోదీని ఎదిరించిన మొనగాడు అయ్యాడని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ పేర్కొన్నారు. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతున్న సందర్భంగా వైసీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రత్యేక హోదా కోరుతూ సోమవారం మైలవరంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, అనంతరం స్థానిక బోసుబొమ్మ సెంటరులో మానవహారం నిర్వహించారు. దీనినుద్దేశించి జోగి రమేష్ మాట్లాడుతూ జగన్ పెట్టిన అవిశ్వాస తీర్మానంతో నక్క జిత్తుల చంద్రబాబు నిజ స్వరూపం బయటపడిందన్నారు. నాలుగేళ్ళు గడచినా ప్రత్యేక హోదా కానీ, ప్యాకేజీని కాని సాధించలేని చంద్రబాబు రాష్ట్రాన్ని ఏం ఉద్ధరిస్తాడన్నారు. దేశ రాజకీయాలలో ఎవరూ చేయలేని పనిని జగన్ చేసి ధీరుడుగా నిలిచాడన్నారు. దేశ నేతలంతా జగన్ వైపు చూస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా అనే రాష్ట్ర ప్రజల హక్కన్నారు. హోదా అనేది సంజీవిని కాదని గతంలో చెప్పిన చంద్రబాబు నేడు హోదా కోసం కేంద్రంతో తెగతెంపులు చేసుకున్నామని చెప్పటం సిగ్గు చేటన్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ అవినీతిని నిన్నటి వరకూ ఆయనకు మద్దతు ఇచ్చిన పవన్ కల్యాణ్ చెప్పాడని గుర్తు చేశారు. జగన్‌పై పెట్టిన కేసులను కోర్టులు కూడా తప్పుబట్టి క్లీన్ చిట్ ఇచ్చిన విషయాన్ని తెలుగుదేశం నేతలు, మంత్రులు గుర్తెరగాలన్నారు. టిడిపి ప్రజాప్రతినిధులు చేసిన పాపాలకు సమయం ఆసన్నమైందని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విచారణ జరిపి ప్రజల సొమ్మును దోచుకున్న వారి నుండి కక్కించటంతోపాటు జైలుకు పంపుతామని హెచ్చరించారు. చంద్రబాబు 40 ఏళ్ళ రాజకీయ జీవితం రక్త చరిత్ర అని ధ్వజమెత్తారు. ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని కేసులు పెట్టినా జగన్‌ను ఏమీ చేయలేవని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రాణ త్యాగాలకైనా సిద్ధమని జోగి రమేష్ ప్రకటించారు. మైలవరంలో మంత్రి ఉమ పనితీరును సైతం జోగి రమేష్ తప్పుబట్టారు. ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెప్పటానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈసమావేశంలో జి కొండూరు జడ్పీటిసి కాజా బ్రహ్మయ్య, పార్టీ నేతలు అప్పిడి సత్యనారాయణరెడ్డి, పామర్తి వెంకట నారాయణ, పామర్తి శ్రీనివాసరావు, పజ్జూరు తిరుపతిరావు, నాగులూరు దుర్గాప్రసాద్, నాగిరెడ్డి, మందా జక్రి, బొమ్మసాని చలపతి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు నేతలు భారీ ర్యాలీగా మైలవరం పుర వీథులలో తిరిగి బోసుబొమ్మ సెంటరుకు చేరుకున్నారు.

మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట - మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం, మార్చి 19: మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా కుట్టు మిషన్‌లో శిక్షణ పొందిన 10వ వార్డుకు చెందిన 80 మంది ముస్లిం మహిళలకు సోమవారం కుట్టు మిషన్లను ఆయన అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం కేటాయించని విధంగా రాష్ట్ర బడ్జెట్‌లో రూ.1102 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మైనార్టీలను విస్మరించిందన్నారు. బడ్జెట్ కేటాయింపులకు ముందు ముస్లిం పెద్దలతో సమావేశమై వారి సాదక బాధకాలు తెలుసుకున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. పేదరికంలో మగ్గుతున్న ముస్లిం విద్యార్థులకు ఉన్నత విద్యనభ్యసించేందుకు బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయన్నారు. రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ ద్వారా పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేస్తున్నామన్నారు. ఇమాం, వౌజన్‌ల గౌరవ వేతనం, దుల్హణ్ పథకం, హజ్ యాత్ర సౌలభ్యం, మసీదుల మరమ్మతు, షాదీఖానాల నిర్మాణం, విద్య, ఉద్యోగాల్లో నాలుగు శాతం రిజర్వేషన్‌కు చట్టబద్ధతకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పేద, మైనార్టీ వర్గాల వారికి ధార్మిక సంస్థలకు ప్రత్యక్షంగా ఉపయోగం జరిగే విధంగా వక్ఫ్ ఆస్తులను అభివృద్ధి పరుస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యుడు బచ్చుల అర్జునుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాధరావు (బుల్లయ్య), మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, ఎఎంసీ చైర్మన్ చిలంకుర్తి తాతయ్య తదితరులు పాల్గొన్నారు.