కృష్ణ

మాతృభాషను, ప్రకృతిని ప్రేమిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఆర్థికంగా మన దేశం ప్రపంచంలోని సంపన్న దేశాల్లో ఆరో స్థానంలో ఉందని, త్వరలోనే నాలుగో స్థానానికి చేరబోతోందని ఉప రాష్టప్రతి ఎం వెంకయ్య నాయుడు అన్నారు. మంగళవారం ఆయన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజుతో కలిసి ఆత్కూరులోని స్వర్ణ్భారతి ట్రస్ట్ ఆవరణలో బాలుర వసతిగృహాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈసందర్భంగా ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ మాతృభాషలో మాట్లాడటంతో పాటు ప్రకృతితో కలిసి జీవించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రకృతిని ప్రేమించడం జీవితంలో ఒక భాగం కావాలన్నారు. దేశం అత్యంత వేగంగా ఆర్థికంగా బలోపేతం అవుతోందని, అయితే సంపద కొందరు వ్యక్తులు, వ్యవస్థల వద్దే పరిమితం అవుతోందన్నారు. స్వావలంభన, స్వశక్తి ద్వారానే సాధించగలుగుతామని, అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా సుస్థిర ఆర్థికాభివృద్ధి సాధించగలుగుతామన్నారు. 17 సంవత్సరాల క్రితం స్వర్ణ్భారత్ ట్రస్ట్‌ను ఒక మంచి ఆశయంతో ఏర్పాటు చేశామని చెప్పారు. తనకు మొదటి బిడ్డ స్వర్ణ్భారత్ ట్రస్ట్ అని ఆయన వ్యాఖ్యానించారు. ఏ ఆశయంతో ట్రస్ట్ ఏర్పాటు చేశామో అందుకు అనుగుణంగానే సేవలు అందిస్తున్నామన్నారు. ఆలయం కంటే పవిత్రమైన స్థలం సేవాలయమని, ట్రస్ట్ ద్వారా తోటివారికి సేవ చేస్తున్నామన్నారు. ఆలయం ఎంత పవిత్రమైనదో సేవా సంస్థ అంతకుమించిన పవిత్ర ప్రదేశమన్నారు. ఒక జాతిని, దేశాన్ని నిర్వీర్యం చేయడంలో వలసవాదులు ప్రయత్నిస్తుంటారనడం చరిత్ర చెబుతున్న వాస్తవమన్నారు. వ్యవస్థను నాశనం చేయడం కోసం మనలో న్యూనతాభావం సృష్టించి నిర్వీర్యం చేసే అవకాశం ఉందన్నారు. స్వర్ణ్భారతి ట్రస్ట్ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని చెప్పారు. భాషను ప్రేరేపించే విధానంలో రచనలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని, భాషను సుసంపన్నం చేయకుంటే భవిష్యత్తులో మాతృభాషలో రచనలు రావన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటూ అత్యంత ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రతిభా పురస్కార్ అవార్డులతో సత్కరించడం తనకు ఎంతో సంతృప్తిని ఇస్తోందని ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ స్వర్ణ్భారతి ట్రస్ట్ నిర్వహణ తీరు తనను ముగ్దుడ్ని చేసిందన్నారు. సాధికారత, నైపుణ్యం, యువ భారత్‌కు కేంద్ర బిందువుగా స్వర్ణ్భారతి ట్రస్ట్ నిలవడంతో పాటు ఆదర్శవంతమైన పాత్రను పోషిస్తోందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చేసే పనిని నైపుణ్యంతో చేయాల్సిన అవసరం ఉందన్నారు. శ్రమైన సౌందర్యాన్ని గౌరవించే విధానంలో ఇక్కడ శిక్షణ కార్యక్రమాలు ఉంటున్నాయన్నారు. యువ భారత్ గ్రామీణ యువతపైనే ఆధారపడి ఉందని, ఆ దిశలో గ్రామీణ ప్రాంతాల్లో స్వర్ణ్భారత్ ట్రస్ట్ చేపడుతున్న కార్యక్రమాలు ఎంతో ఆదర్శంగా ఉన్నాయని తెలిపారు. అందుకు సరైన తార్కాణంగా స్వర్ణ్భారత్ ట్రస్ట్ నిలుస్తుందన్నారు. ఇలాంటి సంస్థను ఏర్పాటు చేసిన ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు, వారి కుటుంబ సభ్యులను అభినందించడం సముచితమన్నారు. ఈశాన్య రాష్ట్రాల ప్రతినిధులను ఇక్కడికి పంపి ట్రస్ట్ కార్యకలాపాలు చూపించి ఆ దిశలో చైతన్యం తేవాలని కోరుకుంటున్నట్లు కేంద్ర మంత్రి వివరించారు. ఈ సమావేశంలో పదో తరగతిలో 10 జీపీఏ సాధించిన పలువురు బాలికలను ప్రతిభా పురస్కారాలతో సత్కరించారు. మేయర్ కోనేరు శ్రీ్ధర్, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, కలెక్టర్ బి లక్ష్మీకాంతం, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.