కృష్ణ

బువ్వకు నోచుకోని అవ్వ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు: నవ మాసలు మోసి, కని పెంచి పెద్ద చేసి, ప్రయోజకులను చేసిన కన్న తల్లికి అన్నం పెట్టటానికి కొడుకులకు మనుస్సు రావటం లేదని తల్లి మాకినేని సరోజిని బోరుమని విలపించింది. సరోజిని ఆదివారం పలు వివరాలను పత్రికా విలేఖరులకు వివరించారు. ఇద్దరు కొడుకులు ఉండి ఓ తల్లిని అనాధగా ఉంచిన వైనం. పండు వయస్సులో కంటికి రెప్పలాగా చూసి తల్లి రుణం తీసుకోవల్సిన తరుణంలో అనాధగా వదిలి వేయటంతో ఆరు నెలల నుంచి పెద్ద కుమార్తె వద్ద సరోజిని ఆసరా పొందుతోంది. శేష జీవితానికి ఆసరాగా ఉన్న 2.15 ఎకరాలను కౌలుకు ఇవ్వకుండా అడ్డుకుని తనకు మానసిక క్షోభను మిగిల్చారని మాకినేని సరోజిని కన్నీరు మున్నీరుగా విలపించారు. తోట్లవల్లూరులో మాకినేని మోహనరావు, సరోజిని(86)లకు నలుగురు సంతానం. ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు, పెద్దకొడుకు మాకినేని వెంకటేశ్వరరావు, రెండవ కొడుకు కోదండరామయ్య, పెద్ద కుమార్తె జాస్తీ లక్ష్మీదుర్గారాణీ, రెండవ కుమార్తె కొర్రపాటి విజయలక్ష్మీ. కొడుకులు ఇద్దరికి మూడు ఎకరాలను, రెండవ కుమార్తె విజయలక్ష్మీకి పసుపు కుంకమ కింద మూడు ఎకరాలను తండ్రి మోహన్‌రావు ఇచ్చాడు. తండ్రి మోహన్‌రావు వ్యవసాయం చేస్తు ఆస్తులు సంపాదించి బిడ్డలకు పంచాడు. ఏడాదిన్నర క్రితం తండ్రి చనిపోయాడు. దాంతో తల్లి ఒక్కతే ఉంది. నడుము పడిపోయి నడవలేని స్థితిలో ఉన్న తల్లి సరోజినిని కంటికి రెప్పలా చూడాల్సిన కొడుకులు ఓ పని మనిషిని పెట్టి చేతులు దూలుపుకున్నారు. కొన్ని రోజుల తరువాత ఆ పని మనిషిని మాన్పించేశారు. దీంతో జనవరి 26న తోట్లవల్లూరులో ఉంటున్న పెద్ద కుమార్తె జాస్తి లక్ష్మీదుర్గారాణి తల్లిని తీసుకువచ్చింది. జనవరి నుంచి కొడుకులు పట్టించుకోకపోవటంతో ఆదివారం విలేఖరులను పిలిచి తన గోడును వెళ్లబోసుకుంది. తన కొడుకులు వెంకటేశ్వరరావు, కోదండరామయ్య తనను పెట్టే బాధలు అంతాఇంతా కాదని సరోజిని తెలిపింది. పింఛన్ మంజూరై 18 నెలలు అయిందని, పింఛన్ డబ్బులు బ్యాంక్‌లో పడటంతో ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా వాళ్ళే వాడుకున్నారని తెలిపారు. ఆన్‌లైన్ తీసివేసిన తర్వాత మూడు నెలలు నుంచి పింఛన్ పంచాయతీ సిబ్బంది వచ్చి తనకు ఇస్తున్నారని సరోజిని తెలిపింది. భోజనం పెద్ద కుమార్తె పెడుతుంటే, మందులు ఖర్చు కోసం మా ఆయన పేరున ఉన్న 1.20 సెంట్లు పొలాన్ని కౌలుకి ఇచ్చానని, ఆ కౌలుదారుడు నా ఖర్చుల నిమిత్తం రూ.20లు ఇచ్చాడని తెలిపింది. ఇప్పుడు తన కొడుకులు కౌలు దారునిపై కేసు పెట్టి పొలం లాక్కున్నారని, పోలీసులు కూడా తనను సంప్రదించకుండా కొడుకులకే వంత పాడుతున్నారని తెలిపింది. ఈ విధంగా చేస్తే తాను ఏ విధంగా బతకాలని, తనకు న్యాయం జరగకపోతే చచ్చిపోదమనుకుంటున్నానని సరోజిని కన్నీరు పర్యంతం అయింది. నా కొడుకుల నుంచి ఆస్తు పాస్తులు ఆశించటం లేదని నేను బతికినంత కాలం నాకు అన్నం పెడితే చాలని తెలిపారు. ఈ విషయాలపై విజయవాడ పోలీసు కమిషనర్‌కు కూడా లిఖిత పూర్వంగా ఫిర్యాదు చేస్తానని సరోజిని చెప్పింది. అధికారులు స్పందించి తనకు న్యాయం జరిగేలా చేయాలని కోరింది.