కృష్ణ

గుడివాడలో పదిళ్లు దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ: గుడివాడ పట్టణం బంటుమిల్లి రోడ్డులోని నాగన్న చెరువుగట్టు సమీపంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. చెరువుగట్టుపై కొద్దిపాటి చెత్తకు నిప్పంటుకుంది. అయితే దీన్ని చిన్న మంటగా భావించి ఎవరూ పట్టించుకోలేదు. గాలి తీవ్రతకు మంట నుండి ఎగసిపడ్డ నిప్పు రవ్వల కారణంగా సమీపంలోని ఇళ్ళకు నిప్పంటుకుంది. కొద్ది నిమిషాల్లోనే రేకులషెడ్డులు, తాటాకు ఇళ్ళు కాలి బూడిదయ్యాయి. అగ్నిమాపకశాఖ అధికారులు హుటాహుటిన స్పందించి సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కొంత మంది పిల్లలు కాలుతున్న ఇంట్లో ఉన్నారన్న సమాచారం మేరకు లీడింగ్ ఫైర్‌మెన్ సీహెచ్ చంద్రశేఖర్ ప్రాణాలకు తెగించి లోనికి ప్రవేశించారు. ఒక బాలుడిని ఎత్తుకుని బయటకు వస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలింది. అదృష్టవశాత్తూ చంద్రశేఖర్ స్వల్ప గాయంతో బయటపడ్డారు. కాగా ఈ ప్రమాదంలో 10ఇళ్ళు దగ్ధం కాగా అందులో ఉంటున్న యాదగిరి మారయ్య, మనె్నం తాయారమ్మ, ఎస్‌కే కరీమున్నీసా, ఎస్‌కే మాబున్నీసా, ఎస్‌కే మీరాబీ, ఎస్‌కే రబ్బాని, ఎస్‌కే మస్తాని, ఎస్‌కే బాజీ, కుంభం వీరమ్మ, ఇటికల బాబూరావు, బుద్దుల భార్గవి, ఎస్‌కే జరుూబున్నీసా, ఎస్‌కే నాగుల్, ఎస్‌కే హజిని, కే సుబ్బమ్మ, పీ నాగేశ్వరరావుల కుటుంబాలు సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలాయి. దాదాపు రూ.10లక్షల ఆస్థినష్టం సంభవించినట్టుగా అధికారులు అంచనా వేశారు. బాధిత కుటుంబాలను మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, వైస్‌చైర్మన్ అడపా బాబ్జి, వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, గుడివాడ ఆర్డీవో ఎం చక్రపాణిలు పరామర్శించారు. ఈ సందర్భంగా యలవర్తి మాట్లాడుతూ అనుకోని విధంగా అగ్నిప్రమాదానికి గురై సర్వం కోల్పోయిన బాధితులను ప్రభుత్వపరంగా అన్నివిధాలా ఆదుకుంటామన్నారు. ఆదివారం అయినప్పటికీ రెవెన్యూ యంత్రాంగం స్పందించి బాధితులకు పునరావాస ఏర్పాట్లు చేయడం అభినందనీయమన్నారు. గుడివాడ-పామర్రు అగ్నిమాపక కేంద్రాల నుండి ఫైరింజన్లు వచ్చి ఆస్థినష్టాన్ని కొంతమేర తగ్గించాయన్నారు. ఆర్డీవో చక్రపాణి మాట్లాడుతూ బాధితులకు ప్రభుత్వపరంగా 5కేజీల చొప్పున బియ్యం, దుప్పట్లు, లుంగీలు, చీరలు, టవర్స్, సబ్బులు, పేస్ట్, కొబ్బరినూనె వంటి నిత్యావసరాలను అందజేశామన్నారు. భోజన వసతిని కూడా కల్పించామన్నారు. జిల్లా కలెక్టర్ బీ లక్ష్మీకాంతం గుడివాడ జరిగిన అగ్నిప్రమాదంపై ఆరా తీశారు. రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. అగ్నిమాపక, పోలీస్‌శాఖల సమన్వయంపై సంతృప్తిని వ్యక్తం చేశారు. కాగా మున్సిపల్ వైస్‌చైర్మన్ అడపా బాబ్జి, వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను తదితరులు బాధిత కుటుంబాలను పరామర్శించారు.