కృష్ణ

ఇంటింటికీ కుళాయికి రూ.130.71 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: మైలవరం నియోజకవర్గంలో ఇంటింటికీ కుళాయిని ఏర్పాటు చేసేందుకు 130.71 కోట్ల రూపాయలు మంజూరైనట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. ఇరిగేషన్ కార్యాలయంలో జరిగిన మైలవరం నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. మైలవరం, రెడ్డిగూడెం, జి కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాలు, మరియు శివారు గ్రామాలలో ఇంటింటికీ మంచినీటి కుళాయిలను ఏర్పాటుకు నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. అదేవిధంగా పది వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములు జి కొండూరు, మైలవరం, రెడ్డిగూడెం, గొల్లపూడిలలో నిర్మించేందుకు నిధులు మంజూరయ్యాయని వెంటనే చర్యలు తీసుకుని పనులు ప్రారంభించాలని సంబంధిత మార్కెటింగ్ మరియు, వేర్ హౌసింగ్ గోడౌన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈనెలలో ఎన్టీఆర్ భరోసా కింద 2274 కొత్త పింఛన్లు మంజూరయ్యాయన్నారు. రెడ్డిగూడెం మండలాలనికి 639, మైలవరం మండలానికి 558, జి కొండూరు మండలానికి 595, ఇబ్రహీంపట్నం మండలానికి 272, విజయవాడ రూరల్ మండలానికి 210 కొత్త పింఛన్లు మంజూరైనట్లు ఆయన వెల్లడించారు. ఇంకా మిగిలిన వాటిని కూడా మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకూ ఎన్టీఆర్, పీఎంఏవై గృహనిర్మాణ పధకం కింద 4744 పక్కా ఇళ్ళు మంజూరవగా వాటిని అందించినట్లు తెలిపారు. గ్రామాలలో పంచాయితీరాజ్ 222.37 కిలోమీటర్ల పనులు 104.66 కోట్లతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీసీ సామాజిక భవనాలు 25 లక్షల రూపాయలతో ఐదు మండల కేంద్రాలలో నిర్మిస్తున్నట్లు తెలిపారు. మాసాంతంలో మిగిలిన గ్రామాలలో సైకిల్ యాత్రలు, ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం చేపడతానని మంత్రి ఉమా వెల్లడించారు. ఈసమావేశంలో నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.