కృష్ణ

‘ప్రత్యేక’ పాలనలోకి ‘పంచాయతీ’లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ప్రత్యేక అధికారుల పాలనలోకి గ్రామ పంచాయతీలు వెళ్లబోతున్నాయి. ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం మరో నెల రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో ప్రత్యేక అధికారుల పాలన అంశం తెర మీదకు వచ్చింది. రద్దయిన పాలకవర్గాల స్థానంలో నూతన పాలకవర్గాల ఎన్నికకు రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి కనబర్చటంతో లేదు. దీంతో ప్రత్యేక అధికారుల పాలన అనివార్యంగా మారింది. ఆగస్టు 2వ తేదీతో ప్రస్తుత పాలకవర్గాల గడువు ముగియనుండగా మరో పక్షంలో రోజుల్లో ప్రత్యేక అధికారుల పాలనపై రాష్ట్ర ప్రభుత్వం నుండి అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం కనిపిస్తోంది. అయితే ప్రత్యేక అధికారుల పాలన గడువు మీదే చర్చ కొనసాగుతోంది. సాధారణ ఎన్నికల వరకు ప్రత్యేక అధికారుల పాలన సాగుతుందా..? అనేది చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తోంది. పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలను ఇప్పటికే సిద్ధం చేశారు. అయితే ప్రభుత్వ ఆదేశాల కోసం ఎన్నికల సంఘం ఎదురు చూస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పంచాయతీ ఎన్నికలు ఇప్పుడిప్పుడే లేవంటోంది. సాక్షాత్తు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ ఇటీవల ఓ కార్యక్రమంలో పంచాయతీ ఎన్నికలు ఇప్పుడే ఉండవని స్పష్టం చేశారు. మరో పక్క డిసెంబర్‌లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందన్న వాదన కూడా వినిపిస్తోంది. జిల్లాలో మొత్తం 970 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఒక్కొక్క మండల అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించనున్నారు. వీరికే పంచాయతీ నిర్వహణ బాధ్యతలను అన్నీ అప్పగించనున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యేడాదిన్నర పాటు గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగింది. ఇదిలా ఉండగా ప్రత్యేక అధికారుల స్థానంలో పర్సన్ ఇన్‌ఛార్జ్‌ల నియామకం పట్ల కూడా ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు వినికిడి. పర్సన్ ఇన్‌ఛార్జ్‌గా ప్రస్తుతం ఉన్న పాలకవర్గాలనే కొనసాగించే అవకాశం ఉంది.

ఇరిగేషన్ సొమ్ము మట్టిపాలు!

*నీటిలో కొట్టుకుపోయన నాలుగు లక్షలు

తోట్లవల్లూరు, జూన్ 24: ఇరిగేషన్ అధికారుల పనులు ముక్కున వేలేసుకునే విధంగా ఉన్నాయి. కేఈబీ కెనాల్‌లో ఉన్న సమస్యలను ప్రక్కన పెట్టి మట్టి దిబ్బలు ఉన్నాయని నీరు - చెట్టు కార్యక్రమం కింద రూ.4లక్షలు కేటాయించి పనులు చేయడాన్ని రైతులు విమర్శిస్తున్నారు. కేఈబీ కెనాల్‌లో వల్లూరుపాలెం నుంచి కళ్ళంవారిపాలెం వరకు మట్టి దిబ్బలు ఉన్నాయని ఇరిగేషన్ అధికారులు పనులు చేపట్టారు. కాని ఆ ప్రాంతంలో ఎక్కడ మట్టిదిబ్బలు లేవు కాని కాలువలో పచ్చగా గరిక పెరిగి ఉండటంతో దానిని జేసీబీతో అటు ఇటు గీకటం, కొంత మట్టిని తవ్వి పక్కనే పోయటం వంటి పనులు చేశారు. నిజానికి ఇక్కడ ఎలాంటి మట్టిదిబ్బలు లేవు. వేసవిలో గడ్డి మొలచి పచ్చగా ఉన్న ప్రదేశాన్ని మట్టిదిబ్బలుగా చూపి తొలగింపు పనులు చేపట్టారు. శనివారం భద్రిరాజుపాలెం వద్ద పనులు చేపట్టారు. మరునాడు ఆదివారం సాగునీటిని విడుదల చేశారు. పనులు మసిపూసి మారేడుకాయ అన్న రీతిలో చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. రూ.4లక్షలు ఎందుకు కేటాయించినట్టో, ఇక్కడ మట్టి దిబ్బలు ఎక్కడ ఉన్నాయో కనిపించడం లేదని ప్రజలు అంటున్నారు. సాగునీరు విడుదలతో ఎక్కడ పని జరిగిందో తెలియని పరిస్థితి. ఈ విషయంపై శ్రీకాకుళం ఇరిగేషన్ ఏఈ రామ్‌కుమార్‌ని వివరణ అడగ్గా కేఈబీ కెనాల్‌లో మట్టిదిబ్బలను ఎక్కడికక్కడ సరిచేయటమేనని తెలిపారు. నీరు - చెట్టు కింద రూ.4లక్షలతో వల్లూరుపాలెం నుంచి కళ్ళంవారిపాలెం వరకు మట్టిదిబ్బలు తొలగించామన్నారు. మట్టిని బయటకు తీయటం ఉండదని అక్కడే సరి చేశారన్నారు.