కృష్ణ

నిధుల కోసం సీఎం అవిశ్రాంత కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామర్రు: సహేతుకంగా జరగని రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రాకు అప్పులు, తెలంగాణకు ఆస్తులు లభించాయని, ఫలితంగా మన రాష్ట్ర నిర్మాణానికి నిధులు, విధులు కేటాయించాల్సి వస్తోందని జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ పేర్కొన్నారు. పామర్రు మండలం ఐనంపూడిలో నూతనంగా నిర్మించిన పంచాయతీ కార్యాలయ భవనాన్ని గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిధులు కోసం అన్ని రకాలుగా పోరాటం చేస్తూ సీఎం చంద్రబాబు విరామం లేకుండా కష్టపడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు. పామర్రు నియోజకవర్గ పరిధిలో నిమ్మలూరు, ప్రాజర్ల రోడ్డుకు రూ.3కోట్లు, వెంట్రప్రగడ, మోపర్రు రోడ్డుకు రూ.2కోట్లు నిధులు కేటాయిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. చురుకైన సర్పంచ్‌లు ఉంటే గ్రామాల సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయని తెలిపారు. పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పొట్లూరి శశి, ఎంపీపీ దగ్గుపాటి ఉషా, ఎంపీటీసీ బివి రాఘవులు, సర్పంచ్ బొప్పన భరత్ కుమార్ తదితరులు పాల్గొని మాట్లాడారు. గ్రామాలలో అంతర్గత రోడ్లను జెడ్పీ చైర్‌పర్సన్ అనూరాధ ప్రారంభించారు. అనంతరం పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆ గ్రామంలో గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించారు.

ప్లాస్టిక్‌తో వాతావరణం కలుషితం

మైలవరం, జూలై 19: ప్లాస్టిక్ వాడకం వల్ల వాతావరణం కలుషితమవుతోందని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనుబంధ సంస్థ సెంటర్ ఆఫ్ స్కిల్లింగ్ అండ్ టెక్నికల్ సపోర్ట్ డైరెక్టర్ అండ్ హెడ్ వి కిరణ్ కుమార్ అన్నారు. స్థానిక ఎల్బీఆర్సీఇలో స్టూడెంట్ బ్రాంచి ఎన్విరాన్‌మెంట్ క్లబ్ ఆధ్వర్యంలో బీట్ పబ్లిక్ పొల్యుషన్ అనే అంశంపై అవగాహనా సదస్సు గురువారం జరిగింది. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఆధునిక జీవన విధానంలో ప్లాస్టిక్ వాడకం ఒక భాగమైందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా ఐదు ట్రిలియన్ ప్లాస్టిక్ బ్యాగులు వినియోగంలో ఉన్నాయన్నారు. ప్లాస్టిక్ వినియోగం మొత్తంలో పారవేయబడేది 50 శాతం ఉంటుందన్నారు. వీటి వల్ల నదులు, సముద్రాలు, భూమి, గాలి కలుషితమవుతున్నాయన్నారు. ఇండియాలో ప్రతి మనిషి సగటున 11 కిలోల ప్లాస్టిక్ వాడుతున్నారని పేర్కొన్నారు. జనాభా పెరుగుదల, పట్టణాల విస్తరణ, హానికరమైన గ్యాస్‌ని మండించటం వంటివి పొల్యుషన్‌కు కారణమవుతున్నాయన్నారు. బ్రాంచి కౌన్సిలర్ ఉమావాణి మాట్లాడుతూ పర్యావరణవేత్తలు కాలుష్యకారకమైన ప్లాస్టిక్‌ని పూర్తిగా వ్యతిరేకించారని గుర్తు చేశారు. అనంతరం కిరణ్ కుమార్‌ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అప్పారావు, కోఆర్డినేటర్లు దీపక్‌రెడ్డి, రవికుమార్, భాగ్యలక్ష్మి, నీలోఫర్ తదితరులు పాల్గొన్నారు.