కృష్ణ

మైలవరం నుంచి ఉమను తరిమేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు: మైలవరం నియోజకవర్గం నుంచి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును 2019 ఎన్నికల్లో తరమటం ఖాయమని వైసీపీ మైలవరం ఇన్‌చార్జ్ వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. మండల పరిధిలోని వెలగలేరులో ఆదివారం జరిగిన గ్రామశాఖ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభధ్రతభావంతో మంత్రి ఉమ తనపై లేని పోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. డబ్బు సంచులని ఒకసారి, హత్యారాజకీయాలు అని మరోసారి మాట్లాడుతున్నాడన్నారు. మంత్రి ఉమ మానసిక పరిస్థితిపై అనుమానం కలుగుతోందన్నారు. పక్క రాష్ట్రంలో కాళేశ్వరం పనులు ఎలా జరుగుతున్నాయో తెలుసుకోవాలన్నారు. మంత్రి హరీష్‌ను చూసి పనితీరు నేర్చుకోవాలని ఉమకు హితవు పలికారు. పోలవరం అంటూ జనాలను బస్సులో పంపటం మినహా ఎటువంటి ప్రగతి లేదన్నారు. ప్రాజెక్టుల పేరుతో డబ్బును దాచుకున్న ఉమ ఇప్పుడు కల్లబొల్లి మాటలు చెబుతున్నారన్నారు. మంత్రి ఉమ, టీడీపీ నాయకుల చరిత్ర అంతా అవినీతి మయమేనన్నారు. ఎర్త్‌వర్క్ పనులపై విచారణ జరిపితే ఎంత అవినీతి జరిగిందో తెలుస్తుందన్నారు. రూ.5లక్షల లోపు నామినేషన్ పనుల్లో ఎన్ని బిల్లులు చేసుకున్నారో ప్రజలకు లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ సీనియర్ నేత జోగి రమేష్ మాట్లాడుతూ ఉమ అంటేనే ధర్నాలు చేసే వ్యక్తిగా గుర్తింపు ఉండేదని కాని అధికారంలోనికి రాగానే అది దోపిడీ ఉమగా మారిందన్నారు. సిఎంకు, లోకేష్‌కు, కాంట్రాక్టర్లకు మధ్యవర్తిగా ఉండి పనులు చేస్తున్నాడన్నారు. వెలగలేరు ప్రజలు టీడీపీకి ఓటేస్తే దివంగత నేత చనమోలు వెంకట్రావు ఆత్మ క్షోభిస్తుందన్నారు. అందరూ ఐకమత్యంగా ఉండి రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయానికి కృషి చేద్దామన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ తిరుపతిరావు, జెడ్పీటిసి కాజ బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

ఎవరు ఎవర్ని తరిమేస్తారో చూద్దాం

*తెలుగుదేశం నాయకుల ప్రతిసవాల్

జి.కొండూరు, జూలై 22: గ్రామాలకు ఎల్లలు తెలియని వారా మంత్రి ఉమామహేశ్వరరావును తరిమేసేది... విమర్శించేది? అని వైసీపీ నేత వసంత కృష్ణప్రసాద్‌ను తెలుగుదేశం నాయకులు ఎద్దేవా చేశారు. దుగ్గిరాలపాడులో ఆదివారం జరిగిన విలేఖరుల సమావేశంలో మైలవరం ప్రభుత్వాసుపత్రి డైరెక్టర్ పటాపంచల నరసింహారావు, గంగినేని సర్పంచ్ మంగలంపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎవరు ఎవర్ని తరిమేస్తారో త్వరలోనే తేలుతుందని అన్నారు. అభివృద్ధి ఎక్కడ ఎంతెంత ఏమేమీ జరిగిందో ప్రజలను అడిగితే చెబుతారన్నారు. రైతు కళ్ళలో నీళ్ళు రాకుండా కాలువల్లో నీటిని పరుగెత్తిస్తున్న అపర భగీరథునిగా ఉమను వర్ణించారు. బీసీ నేత, పెడన మాజీ ఎమ్మెల్యే జోగిని ఇక్కడ నుంచి డబ్బు సంచులను ఎరవేసి సాగనంపారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారన్నారు. కానీ ఇక్కడ బీసీలకు టీడీపీ పెద్దపీట వేసిందన్నారు. ఇక్కడ పరిశ్రమలు స్థాపించి యవతకు ఉపాధి కల్పిస్తానని వాగ్దానాలు ఇస్తున్న వసంత, గతంలో నందిగామలో ఎన్ని పరిశ్రమలు స్థాపించి ఎంతమందికి ఉపాధి కల్పించారో చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రామల్లో ప్రజలు అభివృద్ధిని చూసి ఓటు అనే ఆయుధంతో వైసీపీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. గతంలో ఇంటికి మూడు రంగులు వేస్తేనే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేవారని, కానీ టిడిపి ప్రభుత్వంలో అటువంటి విధానం లేదన్నారు. కల్లబొల్లి కబుర్లు చెప్పటం, అబద్ధాలు ఆడటం వైసీపీ వారికి వెన్నతో పెట్టిన విద్యన్నారు. అభివృద్ధిపై చర్చలకు సిద్ధమేనా? అని వసంతను సూటిగా ప్రశ్నించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు సంపశాల వెంకట కృష్ణారావు, ఈమని శివశంకరవరప్రసాద్, పొనె్నగంటి నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.