కృష్ణ

పంద్రాగస్టు వేడుకలకు సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: దేశభక్తిని ఇనుమడింప చేసే విధంగా పంద్రాగస్టు వేడుకల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఇందుకు గాను జిల్లా పోలీసు పెరేడ్ గ్రౌండ్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. బుధవారం నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్ర మహిళా సాధికారత, శిశు సంక్షేమం, దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత ముఖ్య అతిథిగా హాజరవుతారు. పరిటాల సునీతతో పాటు జిల్లాకు చెందిన మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు, జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం ఇతర ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారు. గతానికి భిన్నంగా ఈ ఏడాది పెరేడ్ గ్రౌండ్‌లో పంద్రాగస్టు వేడుకల నిర్వహణకు జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం చర్యలు తీసుకున్నారు. జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన సుమారు 250 మంది జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి అధికారులకు ప్రశంసా పత్రాలను అందించనున్నారు. స్వాతంత్య్ర సమరయోధులను సత్కరించటంతో పాటు పెద్ద ఎత్తున ఉపకార వేతనాలను కూడా అందించేందుకు సంక్షేమ శాఖాధికారులు సిద్ధమయ్యారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్‌ల ద్వారా ఉపకరణాలు అందించనున్నారు. అతిధులు అధిరోహించే వేదికను శోభాయమానంగా తీర్చిదిద్దారు. సాయుధ దళాల కవాతు కోసం ప్రత్యేకంగా ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. అలాగే విద్యార్థినీ విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలకు అనుకూలంగా గ్రౌండ్‌ను సిద్ధం చేశారు. ఇదిలా ఉండగా వేడుకల్లో తమ తమ శాఖల ప్రగతిని తెలియ జేసే విధంగా పలు ప్రభుత్వ శాఖల అధికారులు శకటాలను సిద్ధం చేశారు. అలాగే ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు గాను శాఖల వారీగా ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు.