కృష్ణ

ప్రత్యేక ఆకర్షణగా భారీ మట్టి గణపతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్): మచిలీపట్నం రాజుపేటలో ప్రప్రథమంగా ఏర్పాటు చేసిన 25 అడుగుల మట్టి గణనాధుడి విగ్రహం పట్టణానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాజుపేట శ్రీలక్ష్మి గణపతి ఆలయం వద్ద లక్ష్మీ గణపతి నిత్య పూజా సేవా సమితి ఆధ్వర్యంలో 30వ గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణను కాంక్షిస్తూ ఈ విడత 25 అడుగుల మట్టి వినాయకుడిని ఏర్పాటు చేశారు. హుస్సేన్‌పాలెంకు చెందిన వీర రాఘవయ్య ఈ మట్టి వినాయకుడిని కన్నుల పండువగా తీర్చిదిద్దారు. నేటి నుండి తొమ్మిది రోజుల పాటు ఈ గణనాధుడు ప్రత్యేక పూజలు అందుకోనున్నారు. 10వ రోజున నిమజ్జనం, అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఎన్నికల కోసమే
సీఎం ‘జ్ఞానభేరి’

ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పవన్‌కుమార్

మచిలీపట్నం (కల్చరల్), సెప్టెంబర్ 12: ఎన్నికల కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు ‘జ్ఞానభేరి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి పవన్ కుమార్ విమర్శించారు. జ్ఞానభేరి కార్యక్రమాన్ని నిరసిస్తూ బుధవారం స్థానిక కృష్ణా విశ్వవిద్యాలయం వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కుమార్ మాట్లాడుతూ జ్ఞానభేరి నిర్వహణకు రూ.5కోట్లు ఖర్చు చేయడం సిగ్గు చేటన్నారు. విశ్వ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1400 పోస్టులను భర్తీ చేయకుండా స్కిల్ డెవలప్‌మెంట్, జ్ఞానభేరి నిర్వహించడం వెనుక చంద్రబాబు ఎన్నికల ప్రచారం దాగి ఉందన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.12లక్షల పోస్టులు, 23వేల ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పలువురు పాల్గొన్నారు.

సీపీఎస్ రద్దుకై 18న ఛలో అసెంబ్లీ

బంటుమిల్లి, సెప్టెంబర్ 12: సీపీఎస్ రద్దుకై ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఈ నెల 18న చేపట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక కామ్రేడ్ గుండాబత్తుల ఆంజనేయులు స్మారక భవనంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఛలో అసెంబ్లీకి ఉపాధ్యాయులు, ఉద్యోగులు హాజరు కావాలన్నారు. ప్రభుత్వం సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆరు లక్షల మంది నిరుద్యోగులు డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారన్నారు. రాష్ట్ర క్యాబినెట్‌లో 20వేల పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపినా ఒక్క పోస్టుకు కూడా నోటిఫికేషన్ జారీ చేయలేదన్నారు. గ్రూప్-2, ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-1లో కలపకుండా యధాతథంగా అర్హులైన నిరుపేద అభ్యర్థులకు అవకాశాలను కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో యుటీఎఫ్ నాయకులు ఎండీ షౌకత్ హుస్సేన్, రాజు, సీపీఎం నాయకులు గౌరిశెట్టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఉత్సవ కమిటీలు నిబంధనలు పాటించాలి

మైలవరం, సెప్టెంబర్ 12: వినాయక చవితి పందిళ్ళ వద్ద నవరాత్రులు జరిపే ఉత్సవ కమిటీలు కనీస నిబంధనలను పాటించాలని మైలవరం సీఐ పి రామచంద్రరావు, ఎస్‌ఐ జి రామకృష్ణ సూచించారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశమైనారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఉత్సవ కమిటీలు ఇష్టానుసారంగా విగ్రహాలను ఏర్పాటు చేయటం, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. ఏ ప్రదేశంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారో, ఎన్ని అడుగుల విగ్రహం, మైక్ అనుమతి, కమిటీ సభ్యుల వివరాలు, నిమజ్జనం ఎప్పుడు, ఎక్కడ, విగ్రహం వద్ద కాపలాదారుల పేర్లు, ఏ పార్టీకి సంబంధించినది, అన్నదానం వివరాలు, విద్యుదీకరణ వివరాలు, ఊరేగింపు వివరాలు, కనకతప్పెట్ల వివరాలను తెలియజేయాలని సూచించారు. గ్రామోత్సవం సమయంలో రికార్డింగ్ డ్యాన్స్‌లు, అశ్లీల నృత్యాలను అంగీకరించేది లేదన్నారు. ఎటువంటి అల్లర్లు జరిగినా ఉత్సవ కమిటీలదే బాధ్యత అన్నారు.

ఎల్బీఆర్సీఈలో జీఐఎస్ సాఫ్ట్‌వేర్‌పై ముగిసిన సదస్సు

మైలవరం, సెప్టెంబర్ 12: స్థానిక ఎల్బీఆర్సీఇలో జిఐఎస్ (జియోగ్రాఫిక్ ఇన్ఫర్‌మేషన్ సిస్టమ్)పై రెండురోజులుగా జరుగుతున్న సదస్సు బుధవారంతో ముగిసింది. సదస్సుకు రీసోర్స్ పర్సన్‌గా హాజరైన హైదరాబాద్ జిఐఎస్ ల్యాబ్ డైరెక్టర్ కెబి చారి మాట్లాడుతూ రిజర్వాయర్లు, డ్యాములు, రోడ్లు, పైప్‌లైన్, కాలువలు, చెరువులు, రైల్వే లైన్లు నిర్మాణంలో కావలసిన స్థల ఎంపిక చాలా జఠిలమైనదని, శాటిలైట్ చిత్రాలను సాఫ్ట్‌వేర్ ద్వారా అధ్యయనం చేసి మనకు అనువుగా ఉండే స్థల ఎంపికలో జిఐఎస్ సాఫ్ట్‌వేర్ చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. వరదలు, తుఫాన్లు వంటివి సంభవించినప్పుడు జరిగే నష్టాలను మదింపు చేసుకోవటానికి కూడా దీనిని వాడవచ్చన్నారు. ఈ సాఫ్ట్‌వేర్ గురించిన పరిజ్ఞ్ఞానం సివిల్ ఇంజనీరింగ్‌లో చాలా ముఖ్యమైన అంశమని అన్నారు. అనంతరం విద్యార్థులకు సర్ట్ఫికెట్లు అందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కె అప్పారావు, వైస్ ప్రిన్సిపాల్ కె శ్రీనివాసరెడ్డి, విభాగాధిపతి రామకృష్ణ, స్టూడెంట్ చాప్టర్ సమన్వయకర్త బి రామకృష్ణ, నిర్వాహకుడు రంగయ్య తదితరులు పాల్గొన్నారు.