కృష్ణ

ముమ్మాటికీ కక్ష సాధింపే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిగామ/జగ్గయ్యపేట రూరల్, సెప్టెంబర్ 14: ముఖ్యమంత్రి చంద్రబాబుని రాజకీయంగా ఎదుర్కోలేక ప్రధాని నరేంద్ర మోదీ, బీజెపీ అధ్యక్షుడు అమిత్‌షాలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని, వారి కనుసన్నల్లో జగన్, కెసీఆర్, పవన్ కల్యాణ్‌లు పని చేస్తున్నారని మాజీ మంత్రి నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, నందిగామ ఎఎంసీ చైర్మన్ చిరుమామిళ్ల శ్రీనివాసరావు తదితరులు విమర్శించారు. బాబ్రీ ప్రాజెక్టు సందర్శన సందర్భంగా 8ఏళ్ల క్రితం జరిగిన సంఘటనపై చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేయడం పట్ల తెదేపా నేతలు, కార్యకర్తలు శుక్రవారం నందిగామ గాంధీ సెంటర్ వద్ద జగ్గయ్యపేట రూరల్ మండలం చిల్లకల్లులో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. చిల్లకల్లు వద్ద కళ్లకు నల్లరిబ్బన్‌లు కట్టుకొని మోదీ, అమిత్‌షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చిల్లకల్లులో మాజీ మంత్రి నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తదితరులు, నందిగామలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఎఎంసీ చైర్మన్ చిరుమామిళ్ల శ్రీనివాసరావు తదితరులు మోదీ చర్యలను నిరసిస్తూ ప్రసంగించారు. దేశంలోనే గుజరాత్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రగల్బాలు పలుకుతున్న బీజెపీ నాయకులు కేంద్రం అండదండలు లేకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలిపేందుకు చంద్రబాబు చేస్తున్న కృషికి అడ్డంకులు సృష్టిస్తున్నారని ఈ నెల 18న ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లకుండా నిరోధించేందుకు బాబ్రీ కేసును బీజెపీ ప్రభుత్వం తెరమీదకు తెచ్చిందన్నారు. పరిస్థితులు చూస్తుంటే ఆపరేషన్ గరుడ అమలు అవుతుందన్న అనుమానాలు వ్యక్తం చేశారు. జగన్ లాగా చంద్రబాబుపై అవినీతి కేసులు లేవని, ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు ప్రజలకు సాగునీరు అందించేందుకు చేసిన పోరాటానికి రాజకీయ రంగు పులిమి గతంలోనే మహారాష్ట్ర ఫ్రభుత్వం ఉపసంహరించుకున్న కేసును తిరగదోడటం దారుణమన్నారు. తెలుగు ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ది చెబుతారని అన్నారు. చిల్లకల్లులో జరిగిన కార్యక్రమంలో మండల తెదేపా అధ్యక్షుడు కట్టా నర్శింహరావు, డీసీ చైర్మన్ వేగినేటి గోపాలకృష్ణమూర్తి, కాచవరం కెనాల్ చైర్మన్ యానాల గోపీచంద్, తాళ్లూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొనగా నందిగామలో జరిగిన కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు కొండూరు వెంకట రమణ, కౌన్సిలర్‌లు, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు యేచూరి రాము, డీసీ చైర్మన్ నెలకుదిటి నాగేశ్వరరావు, రాటకొండ మల్లికార్జునరావు, కరీముల్లా, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.