కృష్ణ

శ్రీ స్వర్ణకవచాలంకృత దేవిగా అమ్మవారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు: జి.కొండూరులోని బీసీ కాలనీలో శ్రీకనకదుర్గ అమ్మవారి సేవాసమితి ఆధ్వర్యంలో జరుగుతున్న విజయదశమి మహోత్సవాల్లో శ్రీస్వర్ణకవచాలంకృత దేవిగా అమ్మవారు బుధవారం భక్తులకు దర్శనమిచ్చారు.

రొయ్యూరు క్వారీలను పరిశీలించిన విజిలెన్స్ అధికారులు
తోట్లవల్లూరు, అక్టోబర్ 10: మండలంలోని రొయ్యూరులో ప్రైవేటు ఇసుక క్వారీలను, మూతపడిన ప్రభుత్వ ఇసుక క్వారీని బుధవారం విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, మైనింగ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రొయ్యూరులో ఇసుక తవ్వకాలపై గ్రామానికి చెందిన పడమట వెంకట సుబ్బమ్మ సోమవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయటం జరిగింది. దీంతో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్‌పి హర్షవర్థనరావు ఆదేశాలతో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజీ బాలాజీనాయక్, హెడ్‌కానిస్టేబుల్ నాగభూషణం, మారుతి, మైనింగ్ సర్వేయర్ చల్లాలు, టెక్నికల్ అసిస్టెంట్ రత్నకుమారి, మండల సర్వేయర్ ఏడుకొండలు, విఆర్‌ఓ రామ్‌కుమార్ బుధవారం క్వారీలను తనిఖీ చేశారు. ఎఎన్ రజనీకాంత్ చెందిన ప్రైవేటు క్వారీ నుంచి ఓవర్‌లోడుతో వస్తున్న రెండు ఇసుక లారీలను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఒక్కో లారీకి రూ.8వేల చొప్పున జరిమానా విధించగా రూ.16 చెల్లించారని అధికారులు తెలిపారు. రొయ్యూరు ప్రైవేటు క్వారీలో ట్రాక్టర్లలో కార్మికులు ఇసుక లోడింగ్ చేస్తున్నారు. అక్కడ ట్రాక్టర్లలో ఇసుక లోడింగ్ చేసి తీసుకు వచ్చి ఓడ్డున అన్‌లోడ్ చేసి లారీల్లోకి లోడు చేస్తున్న వైనాన్ని చూశారు. ఇక్కడ నుంచి ఎల్‌అండ్‌టి నిర్మిస్తున్న ఏపీ టిడ్‌కో గృహ నిర్మాణాలకు ఇసుక రవాణా చేస్తున్నారని తెలిపారు. అలాగే రొయ్యూరు ప్రభుత్వ ఉచిత ఇసుక క్వారీని కూడా పరిశీలించారు. రెండు రోజులుగా ఇసుక తవ్వకాలను నిలిపి వేయటంతో అక్కడ ఇసుక తవ్వకాలను ఎంత లోతు, ఎంత విస్తీర్ణంలో చేశారో చూశారు.