కృష్ణ

దుర్గగుడి హుండీల ఆదాయం రూ. కోటీ 68 లక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి: దసరా మహోత్సవాలు ముగిసిన సందర్భంగా తొలి రోజున అమ్మవారి సన్నిధిలోని హుండీలను దేవస్థానం ఈవో వీ కోటేశ్వరమ్మ ఆధ్వర్యంలో సిబ్బంది లెక్కించగా 1కోటి, 68లక్షల, 18వేల, 490 రూపాయలు లభించాయి. ఇదేవిధంగా 220గ్రాముల బంగారం, 8కిలోల 650 గ్రాముల వెండి లభించాయి. శ్రీమల్లిఖార్జున మహామండపం 6వ అంతస్తులో సోమవారం ఉదయం దేవస్థానం కమిటీ చైర్మన్, ధర్మకర్తల సమక్షంలో సిబ్బంది హుండీలను లెక్కించగా ఈనగదు లభించింది.

బాబు, మోదీ రాజధానికి చేసింది శూన్యం
* వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి పార్థసారథి విమర్శ
విజయవాడ(సిటీ), అక్టోబర్ 22: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణాన్ని సింగపూర్ కంపెనీలకు అప్పచెప్పిన సీఎం చంద్రబాబు, శంకుస్థాపన చేసిన మోదీ రాజధాని కోసం చేసింది శూన్యమని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. నగరంలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధాని నిర్మాణాన్ని గ్రాఫిక్ డిజైన్లను భూతద్దంలో చూపుతున్న చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మధ్యపెడుతున్నారన్నారు. శంకుస్థాపన చేసిన మూడేళ్లలో సాధించింది ఏం లేదని, ప్రస్తుతం ఆ స్థలంలో పిచ్చిమొక్కలు, టీడీపీ ఎమ్మెల్యే గేదెలను మేపేందుకు ఉపయోగపడుతుందన్నారు. జరగని పనులకు రూ. 4.5 కోట్లు చెల్లించమని అధికారులకు ఆదేశాలు కూడా కేబినెట్ మీటింగ్ పెట్టిమరీ ఇచ్చారన్నారు. దేశంలోని మేధావులు, ఇతర రాజకీయ పక్షాలు స్విస్ ఛాలెంజ్ పద్ధతి సరైంది కాదని, మన రాజధాని విదేశీయుల చేతిలో పెట్టవద్దని చెబుతున్నా, సింగపూర్‌పై ప్రేమతో కోర్ క్యాపిటల్‌ను వారికి అప్పగించారన్నారు. అయితే ఇప్పటికి నిర్మాణంలో ఒక్క అడుగు ముందుకు పడలేదని, కంపెనీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సమాధానం చెప్పే పరిస్థితి కూడా లేదన్నారు. భూములు ఇచ్చిన రైతులు నష్టపోయారని, పంటలు పండించుకునే రైతులు నేడు పనులు లేక, కౌలు లేక, ఉపాధి కోల్పోయారని చెప్పారు. కేవలం సింగపూర్ కంపెనీలు మాత్రమే చేసేలా టెండర్ విధానాలు చంద్రబాబు రూపొందించారని, మన దేశంలో ఎవరికీ అవకాశం ఇవ్వని విధంగా రూపొందించినట్లు ఆరోపించారు. తనకు ఎవరైతే 10నుండి 15శాతం ముడుపు ఇవ్వగలరో ఆ విధంగా టెండర్లు తయారు చేశారని ఆరోపించారు. చంద్రబాబు తెలివిగా డిజైన్లు, పైపులైన్స్, గ్రీనరీ అన్ని వాళ్లే అంటే కావాల్సిన కాంట్రాక్టర్‌కు పనులు ఇచ్చేలా నిబంధనలను రూపొందించినట్లు తెలిపారు. తన దోపిడీ అంతా ప్రజలకు తెలిసిపోతుందని కేంద్రాన్ని ఇందులోకి రాకుండా తాను దోచుకున్న డబ్బును రాజధాని నిర్మాణంలో పెట్టేలా ఇటీవల బాండ్లు జారీ చేశారన్నారు. అందులో బాబుకు సంబంధించిన కేవలం 9 మంది మాత్రమే పెట్టుబడులు పెట్టినట్లు గుర్తుచేశారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో చంద్రబాబు, లోకేష్ ఆస్తులను ఏవిధంగా హస్తగతం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆయన విమర్శించారు. వైకాపా డిమాండ్ చేస్తున్న విధంగా రూ.1182 కోట్లు విడుదల చేస్తే 14 లక్షల మంది ఖాతాదారుల సమస్య వెంటనే పరిష్కారవౌతుందన్నారు. ఈరోజు అగ్రి అంశంలో డిమాండ్ చేస్తున్న బీజేపీ నేతలు ఇది ఏపీకి మాత్రమే సంబంధించిన అంశం కాదని, 32లక్షల మంది బాధితులు దేశ వ్యాప్తంగా ఉన్నారని గుర్తించాలని పార్థసారథి హతవు పలికారు.