కృష్ణ

టెక్నాలజీ సహాయంతో అదుపులోకి జాతీయ నేరగాళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామర్ : దేశంలోనే అనేక రాష్ట్రాలలో భారీ స్థాయి దొంగ తనాలకు పాల్పడి లక్షలాది రూపాయలు విలువ చేసే సొత్తు, నగదు దోచుకునే జాతీయ స్థాయి నేరగాళ్లను సాహసోపేతమైన ‘ఆపరేషన్’ ద్వారా పట్టుకుని శోధన ప్రక్రియలో ఉన్న పామర్రు సర్కిల్ పోలీసులకు పెద్దఎత్తున ఇటు ప్రజల్లోను అటు అధికారుల్లోను గుర్తింపు, ప్రశంసలు లభించాయి. ఈ ఏడాది ఏప్రిల్ 23న స్థానిక ప్రతాప్ కళాశాల సమీపంలోని కొల్లా శ్రీనివాసరావు అనే రైస్‌మిల్ వ్యాపారి గృహం తాళాలు పగులగొట్టి సుమారు రూ.5.5లక్షల విలువగల సొత్తు, నగదు దొంగలు ఎత్తుకుపోయిన సం ఘటన పాఠకులకు విదితమే. అయితే తర్వాత వారం రోజుల వ్యవధిలో ఉ య్యూరు, చల్లపల్లి ప్రాంతాల్లో ఇదే త రహాలో పెద్దఎత్తున చోరీలు జరిగాయి. పామర్రు సీఐ డి శివశంకర్, పామర్రు ఎస్‌ఐ పి రాంబాబులు ఉన్నతాధికారుల అనుమతితో దొంగలను పట్టుకోవాలని ఆపరేషన్ ప్రారంభించారు. మూడు చోరీలు జరిగిన గృహాల వద్ద దొంగలు తాగి పడవేసిన బీడీలు మంగులూరు బ్రాండ్ కావటంతో తొలుత పామర్రు పోలీస్ అధికారులు గుర్తించి ఒక ముఠా వరుస దొంగతనాలకు పాల్పడిందని భావించారు. దొం గతనాలు జరిగిన తేదీలలో పామర్రు, ఉయ్యూరు, చల్లపల్లిలలో 18 సెల్ టవర్ల కింద ఉన్న రోజుకు తొమ్మిది వేల ఫోన్‌కాల్స్ డేటా ద్వారా లక్షా 80వేల కాల్స్ ఉన్న ఆ డేటాలో ఒకేసారి కలిసి ఉన్న ఐదు ఫోన్ నెంబర్లను గత ఆరునెలలుగా పరిశీలిస్తూ రెండునెలల కిందట గుర్తించారు. రెం డు నె లలుగా అందులో వినియోగం లో ఉ న్న ఒక సెల్‌ఫోన్ కాల్స్ ద్వారా ఆ జా తీయస్థాయి నేరగాళ్లు ఉండే తమిళనాడులోని చెన్నైకు 300 కిలోమీటర్ల దూరంలో భయంకరమైన అడవికొండపై ఉన్న అండితొట్టి మండలం వొరతనాడు గ్రామంగా కనుగొన్నారు. ఆ గ్రామంలో ఉన్న సుమారు 400 మ ందిలో ఎక్కువమంది నేరగాళ్లు కా వటం విశేషం. రెండు నెలల కిందట ప్రాణాలకు తెగించి వ్యయప్రయాసలతో మా రువేషాలతో పామర్రు పో లీసు అధికారులు ఆ గ్రామ సమీప ంలో కాలినడకన చేరుకుని నెంబరు కనుగొన్న సెల్‌ఫోన్ వినియోగిస్తున్న వ్యక్తి రామస్వామిని పట్టుకుని కొరియర్‌గా పామర్రుకు తీసుకువచ్చారు. కొరియర్ రామస్వామి ద్వారా దొంగతనాలకు పాల్పడిన మరో ఇద్దరు కరుణానిధి, పాండ్యన్ అనే వ్యక్తులను గుర్తించారు. నెల రోజుల కిందట మరల పామర్రు అధికారులు మరో పదిమంది సిబ్బందితో కలిసి రెండు కార్లు, ఒక జీప్‌తో తమిళనాడు వెళ్లారని తెలిసింది. ఈసారి తమిళనాడు పోలీస్ సహకారం తీసుకున్నారు. మొత్తం మీద చాకచక్యంగా కరుణానిధి, పాండ్యన్‌ను అదుపులోకి తీసుకుని పామర్రు తీసుకువచ్చారు. జిల్లా ఎస్పీ త్రిపాఠి, గుడివాడ డీఎస్పీ మహేష్ ఆధ్వర్యంలో పామర్రు అధికారులు నందివాడ స్టేషన్‌లో ఉంచి విచారణ మొదలు పెట్టారు. అనేక రాష్ట్రాలలో దొంగ తనాలకు పాల్పడే పెద్ద దొంగల ముఠా ఉన్నట్లు గుర్తించారని తెలిసింది. ఇంతలో ‘కొరియర్‌గా’ తీసుకువచ్చిన రామస్వామికి గతంలో ఉన్న గుండె సంబంధించిన వ్యాధి ముదిరి తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో విజయవాడలోని ఓ ప్రైవేట్ (పళ్లెం) ఆసుపత్రిలో వారంరోజుల పాటు చికిత్స చేయించి తమిళనాడులోని బంధువులను పిలిపించి అప్పగించి పంపేశారు. పామర్రులో దొంగతనంనందు పోయినది సుమారు రూ.5.50లక్షలు. కాని పట్టుదలతో ఈ జాతీయస్థాయి దొంగల ముఠాను పట్టుకోవాలని ఈ ఆరునెలల్లో ఇప్పటి వరకు పోలీసులు సుమారు రూ.4లక్షలు ఖర్చు చేశారని తెలిసింది. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం గుర్తించిన ఇద్దరు నిందితులలో ఒకరు క్షయవ్యాధితో బాధపడుతుంటే గుడివాడ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తూ కూపీ లాగుతుండగా వారం రోజుల కిందట కొందరి సమాచారం అందటంతో రెండు రోజులు కిందట సీఐ శివశంకర్, ఎస్‌ఐ రాంబాబు, గుడ్లవల్లేరు ఎస్‌ఐ విజయకుమార్‌తో పాటు పదిమందికి పైగా సిబ్బంది తమిళనాడు వెళ్లారు. విశేషమేమిటంటే ఈ దొంగల దగ్గర ఏ మాత్రం సొత్తు, సొమ్ము రికవరీ చేయలేకపోతున్నామనే బాధ పోలీస్ అధికారులను వెంటాడుతోంది. పూర్తిస్థాయి విచారణ జరిపి దర్యాప్తు పూర్తికాగానే త్వరలో అరెస్ట్ చూపుతామని పోలీసులు అనధికారికంగా వెల్లడించారు. ఆరునెలలు శ్రమించి కేసును చేధించి జాతీయస్థాయి నేరగాళ్లను పట్టుకున్న పామర్రు సర్కిల్ పోలీస్ అధికారులకు రాష్ట్ర స్థాయిలో రానున్న రిపబ్లిక్‌డే వేడుకల్లో అవార్డులు అందుకునేలా సిఫార్స్ చేస్తామని పోలీస్ ఉన్నతాధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు వ్యక్తం చేస్తున్నారు.