కృష్ణ

ట్రిపుల్ ఐటీల్లో నైపుణ్యాభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు: రాజీవ్‌గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం పరిధిలోని ట్రిపుల్ ఐటీలలో నైపుణ్యాబివృద్ధి శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వవిద్యాలయం కులపతి వి రామచంద్రరాజు వెల్లడించారు. ట్రిపుల్ ఐటీలలో చదువుకుంటున్న విద్యార్ధులకు వివిధ సాంకేతిక అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తామని చెప్పారు. నూజివీడు ట్రిపుల్ ఐటీని మంగళవారం ఆయన సందర్శించారు. ట్రిపుల్ ఐటీలో ఉన్న అన్ని బ్లాకులను స్వయంగా పరిశీలించి, విభాగ అధిపతులు, అధ్యాపకులతో విడివిడిగా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలు మంజూరు చేసిందని, ఈ శిక్షణ కేంద్రాలు విద్యార్ధులకు ఎంతో మేలు చేస్తాయని చెప్పారు. ఒక్కో బ్యాచ్‌కు 60 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. నూజివీడులో ట్రిపుల్ ఐటీలో ఉన్న మెటలర్జీ విభాగాన్ని ఇడుపులపాయ తరలించే విషయాన్ని గతంలో ఆంధ్రభూమి దినపత్రిక ప్రచురించింది. ఈ విషయంపై ఆయనను వివరణ కోరగా గతంలో నూజివీడులో ఉన్న మెటలర్జీ విభాగాన్ని ఇడుపులపాయకు, ఇడుపులపాయలో ఉన్న రసాయక విభాగాన్ని నూజివీడు ట్రిపుల్ ఐటీకి తరలించే ప్రతిపాదన ఉందని, అయితే దీనిపై సమగ్రంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దాదాపుగా ఎక్కడి విభాగాలు అక్కడే పనిచేస్తాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ల్యాప్‌టాప్‌ల కొనుగోలు, ఉద్యోగుల వేతనాలు పెంపు, పలువురు అధ్యాపకులపై వచ్చిన అభ్యంతరాలు తదితర అంశాలపై సమీక్ష జరుపుతామని తెలిపారు. శాక్, ఆడిటోరియం భవన నిర్మాణాల పురోగతిపై ఇసీలో చర్చించామని అన్నారు. పీహెచ్‌డీ విద్యార్థులకు సెలవు ఇచ్చే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. అడ్మిషన్ల ప్రక్రియలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, ఉన్నత విద్యామండలి చైర్మన్‌తో ఈ నెలాఖరులో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు కులపతి రామచంద్రరాజు తెలిపారు.

ప్రతి పంటకు గిట్టుబాటు ధర

పెడన, నవంబర్ 13: రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని రాష్ట్ర మార్కెటింగ్, పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి సిహెచ్ ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక మార్కెట్ యార్డులో రూ.1.20లక్షలతో నిర్మించిన గోడౌన్, రూ.46.50లక్షలతో నిర్మించిన రైతు బజారును మంగళవారం ఆయన ప్రారంభించారు. రైతు రథం కింద 25 మంది రైతులకు సబ్సిడీతో కూడిన ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ రైతులు తమ పంటను గోడౌన్‌లలో దాచుకుని మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకునే విధంగా ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని అమలు చేస్తోందన్నారు. రైతులు దాచుకున్న పంటకు రుణ సౌకర్యం కూడా కల్పిస్తున్నామన్నారు. న్యాయ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కోస్తా జాతీయ రహదారి 216 నిర్మాణం తమ ప్రభుత్వ ఘనత అన్నారు. గ్రామ గ్రామాన సీసీ రోడ్లు, 24 గంటలు నిరంతర విద్యుత్ అందిస్తున్నామన్నారు. ముడ చైర్మన్ బూరగడ్డ వేదవ్యాస్ మాట్లాడుతూ పెడనలో రైతు బజారు లేని లోటు నేటితో తీరిందన్నారు. ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ దళారీ వ్యవస్థ లేకుండా రైతులకు న్యాయం జరిగే విధంగా రైతు బజార్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ రైతులకు పూర్తిగా రుణమాఫీ చేసి వడ్డీతో సహా రైతులకు అందించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబేనన్నారు. స్థానిక ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్ మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలకు రైతు బజారు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, ఎఎంసీ చైర్మన్ గుడిశేవ రామారావు, మున్సిపల్ వైస్ చైర్మన్ హన్ను, మాజీ జెడ్పీటీసీ బూరగడ్డ శ్రీకుమార్ తదితరులు పాల్గొన్నారు.