కృష్ణ

దళారీ వ్యవస్థను రూపుమాపాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: రైతులు పండించిన పంటలను నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ రాష్ట్రంలో దళారీ వ్యవస్థను పూర్తిగా రూపుమాపినట్లు రాష్ట్ర మార్కెటింగ్, పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి సిహెచ్ ఆదినారాయణ రెడ్డి అన్నారు. మచిలీపట్నం రాజుపేటలో రూ.50లక్షలతో నిర్మించనున్న రెండవ రైతు బజారు నిర్మాణ పనులకు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎమ్‌డీ ఫరూక్, న్యాయ శాఖ మంత్రి కొల్లు రవీంద్రలతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించే ధరలకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నామన్నారు. మార్కెట్ యార్డులు, రైతు బజార్ల ద్వారా దళారీ వ్యవస్థను పూర్తిగా రూపుమాపామన్నారు. రాష్ట్రంలో పశు సంపద పెంపుకు కృషి చేస్తున్నామన్నారు. తెలంగాణ, ఒరిస్సా తప్ప ఏ రాష్ట్రం నుండైనా మేలు జాతి పశువుల కొనుగోలుకు ప్రభుత్వం రుణం మంజూరు చేస్తోందన్నారు. పాల దిగుబడి పెంపుకు పశుగ్రాస క్షేత్రాలను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. రెండు పశువులు గల రైతులకు లక్ష రూపాయలు, నాలుగు పశువులు గల రైతుకు లక్షన్నర, ఆరు పశువులు గల రైతులకు రూ.2లక్షలు వరకు గోకులాలు మంజూరు చేస్తున్నామన్నారు. గిలకలదిండిలో రూ.15లక్షలతో చేపల మార్కెట్ అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ మాట్లాడుతూ మైనార్టీల్లో చాలా మంది పేదలు ఉన్నారని, వారి ఆర్థికాభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. తొలిసారి మైనార్టీల సంక్షేమానికి బడ్జెట్‌లో అత్యధిక నిధులు కేటాయించిన ఘనత తమకే దక్కుతుందన్నారు. అన్యాక్రాంతమైన వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. న్యాయ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రెండవ రైతు బజారు ఏర్పాటుకు రూ.10కోట్లు విలువైన మున్సిపాల్టీ స్థలాన్ని మార్కెటింగ్ శాఖకు బదిలీ చేశామన్నారు. ముడ చైర్మన్ బూరగడ్డ వేదవ్యాస్ మాట్లాడుతూ జిల్లా కేంద్రం మచిలీపట్నంకు రెండవ రైతు బజారు అవసరం ఎంతో ఉందన్నారు. ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ రాజుపేట ఏరియా ఓల్డ్ టౌన్‌గా ఉండేదన్నారు. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ రెండవ రైతు బజారు వల్ల ఈ ప్రాంత ప్రజలు ఎంతగానో ప్రయోజనం పొందనున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.