కృష్ణ

దుర్గమ్మ సేవలో హైకోర్టు న్యాయమూర్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి: ఇంద్రకీలాద్రిపై కొలువైన ఆదిపరాశక్తి శ్రీ కనకదుర్గమ్మను శనివారం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల హైకోర్టు జస్టిస్ బి శివశంకరరావు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఈసందర్భంగా ఆలయ పూజారులు అమ్మవారి రాజగోపురం వద్ద ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం తర్వాత ఆశీర్వాద మండపంలో అర్చకులు అమ్మవారి దివ్య ఆశీస్సులను, ఆలయ ఈవో వి కోటేశ్వరమ్మ అమ్మవారి శేషవస్త్రం, చిత్రపటం, ప్రత్యేక ప్రసాదాలు అందచేశారు. హైకోర్టు జస్టిస్ ఎన్ బాలయోగి కూడా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అమ్మవారి ఆశీర్వాద మంటపంలో ఆలయ ప్రధాన అర్చకుడు లింగంభొట్ల దుర్గాప్రసాద్ అమ్మవారి చిత్రపటం, ప్రత్యేక ప్రసాదాలు అందజేశారు.

పారదర్శకంగా అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీ
*సబ్ కలెక్టర్ మిషాసింగ్
విజయవాడ (కార్పొరేషన్), నవంబర్ 17: విజయవాడ డివిజన్ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీని ప్రతిభ ఆధారంగా పారదర్శకంగా చేపడుతున్నట్టు సబ్‌కలెక్టర్ మిషాసింగ్ పేర్కొన్నారు. శనివారం స్ర్తి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 8 ఐసీడీఎస్ ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న ఆంగన్‌వాడీ వర్కర్లు, మిని అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు నిర్వహించిన వౌఖిక పరీక్షల సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయవాడ - 1, 2, కంకిపాడు, కంచికచర్ల, చిల్లకల్లు, నందిగామ, మైలవరం, ఉయ్యూరు, ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని 40 అంగన్‌వాడీ వర్కర్లు, రెండు మినీ అంగన్‌వాడీ వర్కర్లు, 42 అంగన్‌వాడీ హెల్పర్ల ఖాళీల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌కు 360 అంగన్‌వాడీ వర్కర్లు, మిని అంగన్‌వాడీ వర్కర్లు, 103 హెల్పర్లు మొత్తం 466 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వీరికి వౌలిక పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక జాబితా త్వరలోనే ప్రకటిస్తామన్నారు. అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలనకు సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా టెంట్‌లు ఏర్పాటుచేసి త్వరిగతిన ప్రక్రియ పూర్తయ్యేందుకు వీ లుగా ఏర్పాట్లు చేయగా, అభ్యర్థులు, వారితోపాటు వచ్చే సహాయకుల సౌకర్యార్ధం తాగునీరు, కుర్చీలను కూడా కల్పించారు.