కృష్ణ

వైభవంగా పాండు రంగడి ఉత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం(కల్చరల్): కీరపండరీపుడైన చిలకలపూడి పాండు రంగడి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కార్తీక శుద్ధ దశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ప్రారంభమైన ఉత్సవాలు కార్తీక పూర్ణిమ వరకు జరగనున్నాయి. రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర-నీలిమ దంపతులు స్వామివారి పట్టు వస్త్రాలు సమర్పించి ఉత్సవాలను ప్రారంభించారు. భక్త నరసింహం మనువడు, ఆలయ నిర్వాహకుడైన టేకి గంగాధరం పర్యవేక్షణలో గణపతి పూజ, గురుపూజ, గోపూజ, విష్ణు సహస్ర నామ పారాయణ నిర్వహించారు. సాయంత్రం స్వామివారి పల్లకి ఉత్సవాన్ని నిర్వహించారు. స్వామివారి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి రవీంద్ర మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి పాండు రంగడి ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 20వతేదీ మధ్యాహ్నం 3గంటలకు స్వామివారి రథోత్సవాన్ని పుర వీధుల గుండా నిర్వహించనున్నట్లు తెలిపారు. చివరి రోజైన ఈ నెల 23వతేదీన కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని సముద్ర హారతి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఆయన వెంట తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి గొర్రిపాటి గోపిచంద్, మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీ విశ్వనాథం (చంటి), ఎఎంసీ చైర్మన్ చిలంకుర్తి తాతయ్య, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఇలియాస్ పాషా తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ సభ్యత్వ నమోదులో బందరును ప్రథమ స్థానంలో నిలపాలి
మచిలీపట్నం(కోనేరుసెంటర్), నవంబర్ 18: తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పార్టీ సమన్వయ కమిటీ సభ్యులకు సూచించారు. ఆదివారం తన కార్యాలయంలో పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బందరు నియోజకవర్గం ఆదర్శంగా నిలవాలన్నారు. అత్యధిక సభ్యత్వాలు నమోదు చేయించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి రానున్న ఎన్నికల్లో పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే పెద్ద ఎత్తున రేషన్ కార్డులు, పెన్షన్‌ల పంపిణీ జరిగిందన్నారు. జీ ప్లస్ 3 గృహాల ద్వారా నివేశన స్థలాల సమస్యను కూడా పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శులు బూరగడ్డ రమేష్ నాయుడు, గొర్రిపాటి గోపిచంద్, మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, వైస్ చైర్మన్ కాశీ విశ్వనాధం (చంటి), ఎఎంసీ చైర్మన్ చిలంకుర్తి తాతయ్య, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ వర్కింగ్ చైర్మన్ తలారి సోమశేఖర్, టీడీపీ పట్టణ, మండల అధ్యక్షులు ఇలియాస్ పాషా, కుంచే దుర్గా ప్రసాద్ (నాని) తదితరులు పాల్గొన్నారు.