కృష్ణ

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం స్థానిక మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, ముడ చైర్మన్ బూరగడ్డ వేదవ్యాస్‌తో కలిసి మంత్రి రవీంద్ర ప్రారంభించారు. అనంతరం రైతురథం పథకం కింద సబ్సిడీతో కూడిన ట్రాక్టర్లు, తైవాన్ స్పేయర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి రవీంద్ర మాట్లాడుతూ విభజనతో నష్టపోయిన రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రైతుల సంక్షేమాన్ని ఏ మాత్రం తమ ప్రభుత్వం మరువలేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణాలను మాఫీ చేశామన్నారు. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంతో పట్టిసీమ ద్వారా డెల్టా భూములను సస్యశ్యామలం చేశామన్నారు. ఆంధ్రుల జీవ నాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారం లేకున్నా శరవేగంగా పనులు చేపడుతున్నామన్నారు. రామరాజుపాలెం ఛానల్ కింద ఆయకట్టుకు సాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. చిన్నాపురం వద్ద గుండేరుపై లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విజయవాడ-మచిలీపట్నం రహదారి విస్తరణ పనులు పూర్తి కావచ్చాయన్నారు. బందరు నుండి బాపట్ల వయా రేపల్లెకు రైల్వే లైను ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. తద్వారా చెన్నైకు 150 కిలో మీటర్ల దూరం తగ్గుతుందన్నారు. భవిష్యత్తులో పలు రైళ్లు మచిలీపట్నం మీదుగా నడిచే అవకాశం ఉంటుందన్నారు. ముడ చైర్మన్ బూరగడ్డ వేదవ్యాస్ మాట్లాడుతూ తమది రైతు ప్రభుత్వమన్నారు. రైతుల సంక్షేమం కోసం రుణమాఫీ, పట్టిసీమ ద్వారా 110 టీఎంసీల నీటిని డెల్టాకు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ రైతులను పూర్తి స్థాయిలో ఆదుకున్నది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వమేనన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలన్నారు. ఎఎంసీ చైర్మన్ చిలంకుర్తి తాతయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, వైస్ చైర్మన్ కాశీ విశ్వనాథం, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ వర్కింగ్ చైర్మన్ తలారి సోమశేఖర్, టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి గొర్రిపాటి గోపీచంద్, హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ మరకాని పరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చర్మకారులకు తోడ్పాటు
* ఇడీ సత్యనారాయణ

మచిలీపట్నం, నవంబర్ 18: చెప్పులు కుట్టుకుని జీవనం సాగిస్తున్న చర్మకారుల ఆర్థికాభివృద్ధికి ఎస్సీ కార్పొరేషన్ చేయూతనిస్తోందని కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్‌వివి సత్యనారాయణ తెలిపారు. ఆదివారం తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన చర్మకారులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.10వేలు విలువ చేసే కిట్‌లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కిట్లతో పాటు రూ.20వేలు రుణాన్ని వారి బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తామన్నారు. 20-50 సంవత్సరాలు వయస్సు కలిగిన చర్మకారులు ఇందుకు అర్హులన్నారు. ఓబీఎంఎంఎస్ ద్వారా లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుందన్నారు. ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ ద్వారా జిల్లాలో 3వేల 970 మంది వివిధ యూనిట్ల మంజూరుకు దరఖాస్తు చేసుకున్నారన్నారు. వీరందరికీ ఈ నెల 29వతేదీ నుండి డిసెంబర్ 10వ తేదీ లోపు ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులను గుర్తించడం జరుగుతుందన్నారు. డీఆర్డీఎ పీడీ, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్, ఆర్డీవో, వ్యవసాయ శాఖ, పశు సంవర్ధక శాఖ అధికారులతో కూడిన కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుందని తెలిపారు. రూ.5లక్షలు పైబడి రుణం కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు విద్యార్హత, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలతో పాటు అప్రైజర్-1 పొందుపర్చాల్సి ఉంటుందన్నారు. రూ.10లక్షలు పైబడి రుణం పొందగోరు లబ్ధిదారులు ధృవ పత్రాలతో పాటు వారు ఎంచుకున్న యూనిట్‌కు సంబంధించి డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టును అందచేయాలన్నారు. గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికులు ఈ-ఆటోలు, డ్రైనేజీ, రోడ్డు క్లీనర్ ట్రాక్టర్ల కోసం ఈ నెలాఖరులోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ విషయంలో డీపీఓ, డీఎల్‌పీఓ, ఎంపీడీవోలు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. డిసెంబర్ 5వ తేదీన నిర్వహించనున్న మెగా మేళాకు సంబంధించి బ్యాంకర్లు నూరు శాతం యూనిట్లు గ్రౌండ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఇడీ సత్యనారాయణ కోరారు.