కృష్ణ

రూ.690 కోట్లతో బలహీన వర్గాల సంక్షేమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: బలహీన వర్గాల సంక్షేమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆదరణ-2 పధకం ద్వారా 690 కోట్ల రూపాయల వ్యయంతో వారి వారి వృత్తులకు అనుగుణమైన పరికరాలను అందించి వారి జీవనోపాధికి ఆసరా కల్పిస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. మండలంలోని పుల్లూరు జడ్పీ హైస్కూల్‌లో గురువారం జరిగిన ఆదరణ-2 పధకం కింద మంజూరైన 280 ఉపకరణాలను లబ్దిదారులకు అందించిన అనంతరం ఏర్పాటైన సభలో మంత్రి ఉమ మాట్లాడుతూ పేదరికంపై గెలుపే లక్ష్యంతో తమ ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు. మైలవరం నియోజకవర్గంలో ఆరు ప్రాంతాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి లబ్దిదారులకు ఉపకరణాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే అన్ని గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన నిర్మిస్తున్నామన్నారు. ఎల్‌ఈడీ లైట్లతో గ్రామంలో సంక్రాంతి శోభను సంతరించుకునేలా వేస్తున్నట్లు వెల్లడించారు. గతంలో కాకుండా కొత్తగా నియోజకవర్గంలో 519 మందికి పింఛన్లు మంజూరు చేశామని ప్రస్తుతం 6,782 మందికి పింఛన్లు అందిస్తున్నామన్నారు. సుమారు వెయ్యి కోట్ల రూపాయల విలువైన 12వేల మందికి ఇళ్ళ స్థలాలు మంజూరు చేయగా వాటిలో 9 వేల మందికి ఇవ్వటం జరిగిందని, మిగిలిన మూడు వేల మందికి త్వరలోనే అందిస్తామన్నారు. నియోజకవర్గంలో 15,594 మందికి పక్కా ఇళ్ళను మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ పధకాలను పొందే విషయంలో దళారులకు గానీ, పార్టీ నాయకులకు గానీ, కార్యకర్తలకు గానీ లబ్దిదారులెవరూ ఒక్క పైసా లంచం ఇవ్వవద్దని సూచించారు. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే 1100 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. అదేవిధంగా పేదరికంలో ఉండి ఆసుపత్రులలో వివిధ రోగాలతో చికిత్సలు జరిపించుకున్న 2,549 మందికి 16.96 కోట్ల రూపాయలను మంజూరు చేయించినట్లు తెలిపారు. పుల్లూరులో 14కిలోమీటర్ల సిసి రోడ్లు వేస్తున్నామని, అన్ని రహదారులలో ఎల్‌ఈడీ లైట్లు వేస్తున్నామని, 34 లక్షల రూపాయలతో పశువైద్యశాల నిర్మాణం చేపట్టి ప్రారంభోత్సవం చేసుకున్నామన్నారు. ఇంత చేస్తుంటే కొందరు దొంగలు అక్రమ సంపాదనతో గ్రామాల్లోకి వచ్చి కులాలు, మతాలను రెచ్చగొట్టి కుట్రలు, కుతంత్రాలు చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని వైసీపీ నేత వసంత కృష్ణ ప్రసాద్‌ను ఉద్దేశించి ఆరోపించారు. తాను చేస్తున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు కోర్టులలో కేసులు వేయటం, పిటిషన్లు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. అంతకుముందు ఆదరణ పధకం లబ్దిదారులకు ఉపకరణాలను పంపిణీ చేశారు. అదేవిధంగా ఎస్‌ఎస్‌ఏ ద్వారా నిర్మితమైన అదనపుతరగతి గదులను ఆయన ప్రారంభించారు. అంగన్‌వాడీ ద్వారా పిల్లలకు సరఫరా అవుతున్న ఆహారం, పరికరాలను ఆయన పరిశీలించారు. సమీపంలో ఏర్పాటైన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులను సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. ఒక్క గింజ కూడా మిగల్చకుండా కొనుగోలు చేయాలని, రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని అధికారులను ఆదేశించారు. పేదలకు ఇళ్ళ స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపిపి లక్ష్మి, తహశీల్దార్ పుల్లయ్య, జడ్పీటిసి రాము, నియోజకవర్గ స్పెషలాఫీసర్ ఆంజనేయరెడ్డి, మండల స్పెషలాఫీసర్ రామారావు, మాజీ సర్పంచ్ వజ్రాల కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.